Do you know how Chiranjeevi does New Year celebrations?
Chiranjeevi : ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఘనంగా ముగిశాయి. పిల్లలు నుంచి పెద్దలు వరకు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ రకరకాలుగా సెలెబ్రేషన్స్ జరుపుకుంటారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా తన న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని ఎలా చేసుకుంటారో అభిమానులకు తెలియజేశాడు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాని తెలియజేశాడు.
Chiranjeevi : ఆ ఒక్క విషయంలో నాకు చరణ్‌కి అసలు పోలిక ఉండదు.. చిరంజీవి!
“న్యూ ఇయర్ వస్తే అందరూ పార్టీలు, పబ్‌లు అంటూ ఎంజాయ్ చేస్తారు అందరూ. కానీ నేను మాత్రం ఎటువంటి పార్టీలకు హాజరవ్వను. డిసెంబర్ 31 రాత్రి 11.30 గంటలకు మా పూజ గదిలోకి వెళ్లి, అంజనేయ స్వామి విగ్రహం ముందు కూర్చుని ధ్యానం చేసుకుంటాను. 12 గంటలకి టపాసుల సౌండ్ వినగానే ధ్యానం నుంచి బయటకి వచ్చి అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తాను.
నేను కాలేజీ చదువుతున్న సమయం నుంచి ఈ పద్ధతి అలవాటు అయ్యింది. పెళ్లి అయిన తరువాత కూడా అది కొనసాగిస్తూనే వస్తున్న. ఈ సాంప్రదాయాన్ని నా భార్య సురేఖ కూడా పాటిస్తుంది” అంటూ తెలియజేశాడు. కాగా ‘వాల్తేరు వీరయ్య’ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కె బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మాస్ మహారాజ్ రవితేజ ఒక ముఖ్యపాత్రలో కనిపించబోతున్నడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.