NTR : రెండు సినిమాలు మొదలయి ఆగిపోయాయి.. కట్ చేస్తే ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఎన్టీఆర్..

ఎన్టీఆర్ కెరీర్ లో కూడా మొదలయి ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. (NTR)

  • Published On : April 2, 2026 / 08:33 AM IST

NTR

NTR : RRR సినిమాతో పాన్ ఇండియా ఫేమ్ తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత దేవర పర్వాలేదనిపించినా, వార్ 2 నిరాశ పరిచింది. ఇప్పుడు డ్రాగన్ అనే భారీ పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఎన్టీఆర్ కెరీర్ లో కూడా మొదలయి ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. ఆది సినిమాతో మంచి కమర్షియల్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ ఆ తర్వాత వెంటనే అల్లరి రాముడు, నాగ సినిమాలతో డిజాస్టర్స్ చూసారు. దీంతో ఎన్టీఆర్ ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకున్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ నిర్మాత దొరస్వామిరాజుకి కమిట్మెంట్ ఇచ్చాడు.

Also Read : RJ Kajal️️️️️️ : బిగ్ బాస్ భామకు ఇంత పెద్ద కూతురు ఉందా..? ఆర్జే కాజల్ ఫ్యామిలీ ఫొటోలు చూశారా..?

ఆ నిర్మాత మొదట పవన్ శ్రీధర్ అనే దర్శకుడితో కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా మొదలు పెట్టారు. ఆ సినిమా షూటింగ్ కూడా మొదలయింది. కానీ అది ఎవరికీ నచ్చలేదు. దీంతో ఆ సినిమా ఆపేసారు. ఆ తర్వాత కలిసుందాం రా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ ఉదయ్ శంకర్ ని తీసుకొచ్చారు. కుర్రాడు అనే టైటిల్ తో సినిమా మొదలుపెట్టి షూటింగ్ కూడా చేసారు. ఆల్మోస్ట్ మూడు కోట్లు ఖర్చుపెట్టిన తర్వాత ఆ సినిమా కూడా ఆగిపోయింది.

ఇక ఎన్టీఆర్ మాత్రం ఆ సమయంలో కథలు వింటూనే ఉన్నాడు. అప్పుడు మళ్ళీ రాజమౌళి వచ్చి సింహాద్రి కథ చెప్పడంతో నిర్మాత, ఎన్టీఆర్ ఇద్దరికీ నచ్చడంతో ఆ సినిమా పట్టాలెక్కింది. 9 కోట్లతో చాలా ఫాస్ట్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. ఆల్మోస్ట్ 32 కోట్లు వసూలు చేసి ఎన్టీఆర్ కి పెద్ద హిట్ ఇవ్వడమే కాక మాస్ ఇమేజ్, స్టార్ డం ఇచ్చింది సింహాద్రి సినిమా. సింహాద్రి సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించిందో అందరికి తెలిసిందే.

Also Read : Director Sukumar : గంట శ్రీనివాస రావుని కలిసిన డైరెక్టర్ సుకుమార్.. ఫొటోలు..