Tollywood Actress : ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..
చాలా మంది సెలెబ్రిటీస్ చిల్డ్రెస్ డే సందర్బంగా తమ తమ చిన్నతనాన్ని గుర్తుచేసుకుంటూ పలు వీడియోలు, ఫోటోలు షేర్ షేర్ చేశారు.

Do you remember The child star heroine in this photo
Tollywood Actress : చాలా మంది స్టార్ హీరోయిన్స్ తమ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. తమకి సంబందించిన ప్రతీ అప్డేట్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు. అలాగే ఏమైనా పండగలు, స్పెషల్ ఈవెంట్స్ ఉంటే వాటికి కూడా ఫోటోలు పెడతారు. ఈ క్రమంలో చాలా మంది సెలెబ్రిటీస్ చిల్డ్రెస్ డే సందర్బంగా తమ తమ చిన్నతనాన్ని గుర్తుచేసుకుంటూ పలు వీడియోలు, ఫోటోలు షేర్ షేర్ చేశారు. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ సైతం ఈ లిస్ట్ లోకి చేరింది.
Also Read : Tollywood Actress : పెళ్లిరోజు స్పెషల్ వీడియో.. ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..
తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే సైతం తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో షేర్ చేసింది. తన చిన్నతనంలో ఒక పెళ్లి వేడుకల్లో దిగిన ఫోటోలని షేర్ చేసుకుంది. ఆ పెళ్ళిలో తను చేసిన అల్లరి కూడా చూపించింది. అలాగే.. ” మన జీవితంలో మనకి ఇష్టమైన వధువును విడిచిపెట్టి వెళ్లలేం. వాళ్ళ పెళ్ళిలో వరుడు కంటే ఎక్కువ ఫోటోలు ఒక చిన్నారివి ఉంటాయి. ఆ చిన్నారి నేనే.. మీ మనసులోని చిన్నారిని ఎప్పటికీ మర్చిపోకండి అంటూ చిల్డ్రన్స్ డే స్పెషల్ గా విషెష్ చెప్తూ ఈ వీడియో పెట్టింది.
View this post on Instagram
బుట్టబొమ్మ పూజా హెగ్డే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అడపాదడపా సినిమాలు చేస్తుంది ఈ భామ.