Tollywood Actress : పెళ్లిరోజు స్పెషల్ వీడియో.. ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..

Tollywood Actress : పెళ్లిరోజు స్పెషల్ వీడియో.. ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..

a special video gift on her wedding day Guess the Heroine

Updated On : November 15, 2024 / 1:58 PM IST

Tollywood Actress : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలిసిందే. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో వసరుసగా స్టార్ హీరోస్ సరసన నటించి బిజీగా ఉన్న ఈ హీరోయిన్ కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేసింది. అక్కడ కూడా భారీ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఇటీవల లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ.

Also Read : Kiran Abbavaram : కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం .. 50 కోట్ల లిస్ట్‪లో ‘క’ సినిమా

అయితే తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో చిల్డ్రన్స్ డే స్పెషల్ గా తన చిన్న నాటి కొన్ని వీడియో లను షేర్ చేసింది. ఇక వీడియో కింద.. ” నా పెళ్లి రోజు కానుకగా నా పేరెంట్స్ నాకు ఇచ్చిన బహుమతి ఇది. నా చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్న ఈ వీడియో నాకు ఎంతో ప్రేత్యేకం. చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పటికీ ప్రత్యేకమే. ఎప్పుడూ నవ్వుతూ, ఆడుతూ, మీలోని చిన్నతనాన్ని ఎప్పటికీ కోల్పోకుండా ఉండండని.. హ్యాపీ చిల్డ్రన్స్ డే” అని పేర్కొంది.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)


ఇక ఆ వీడియో లో రకుల్ ప్రీత్ సింగ్ తన చిన్నప్పుడు ఆడుకోవడం, డాన్స్ చెయ్యడం, ఐస్ క్రీమ్ తినడం, తన బర్త్ డే కేక్ కట్టింగ్ ఇలా చాలా ఉన్నాయి. తన చిన్ననాటి అన్ని విషయాలను కలిపి ఓ వీడియో రూపంలో రకుల్ కి గిఫ్ట్ గా ఇచ్చారు తన కుటుంబం. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.