Kiran Abbavaram : కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం .. 50 కోట్ల లిస్ట్‪లో ‘క’ సినిమా

Kiran Abbavaram : కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం .. 50 కోట్ల లిస్ట్‪లో ‘క’ సినిమా

Kiran Abbavaram who scored the biggest hit of his career Ka movie collected 50 crores

Updated On : November 15, 2024 / 1:18 PM IST

Kiran Abbavaram : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ క ‘. సుజిత్, సందీప్ సంయుక్త దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ అందుకుంటూ వచ్చింది. అమరన్, లక్కీ భాస్కర్ వంటి సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ భారీ వసూళ్లు రాబట్టింది.

Also Read : Vishwak Sen : నేను టాప్ 4 హీరో అయితే.. టాప్ 3లో వాళ్లే ఉంటారు.. విశ్వక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అక్టోబర్ 31 దీపావళి సందర్బంగా వచ్చిన ఈ సినిమా విడుదలై ఈ రోజుకి 15 రోజులు అయ్యింది. అయితే ఈ 15 రోజుల్లో ‘క’ సినిమా 50 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం అధికారికంగా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కేవలం 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లు వసూలు చెయ్యడంతో కిరణ్ అబ్బవరంతో పాటు, ఇటు చిత్రబృందం సైతం ఎంతో సంతోషంగా ఉన్నారు.


వరుస ఫ్లాప్స్ తో ఉన్న కిరణ్ అబ్బవరం కి ‘క’ సినిమా భారీ విజయాన్ని ఇచ్చింది. అంతేకాకుండా తాజాగా విడుదలైన కంగువా, మట్కా వంటి పెద్ద సినిమాలకి కూడా ‘క’ చిత్రం మంచి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే 100కోట్ల క్లబ్ లోకి కూడా చేరాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.