Salute Movie : దుల్కర్ డిఫరెంట్ థ్రిల్లర్ ‘సెల్యూట్’..
పాపులర్ యంగ్ యాక్టర దుల్కర్ సల్మాన్ నటిస్తున్న డిఫరెంట్ థ్రిల్లర్ ‘సెల్యూట్’ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది..
- sekhar
- Published On : December 25, 2021 / 02:01 PM IST
Salute Movie
Salute Movie: పాపులర్ మలయాళీ యంగ్ యాక్టర దుల్కర్ సల్మాన్ వరుసగా డిఫరెంట్ స్టోరీస్, అంతే డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ్, హిందీ ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితుడే.
ఇటీవల ‘కురుప్’ అనే డిఫరెంట్ ఫిలింతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దుల్కర్ ఇప్పుడు ‘సెల్యూట్’ అనే డిఫరెంట్ థ్రిల్లర్‌తో రాబోతున్నారు. రోషన్ ఆండ్రూస్ డైరెక్షన్‌లో, దుల్కర్ సమర్పణలో.. వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఈ ‘సెల్యూట్’ మూవీ తెరకెక్కుతోంది.
Mammootty-Dulquer Salmaan : శివరాత్రికి తండ్రీ కొడుకులు ‘ఢీ’..
డయానా పెంటీ కథానాయికగా నటిస్తోంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన మలయాళం ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనుకోని కారణాలతో జైలుకెళ్లడం.. తిరిగి వచ్చాక ఓ అంతుచిక్కని కేసుని సాల్వ్ చేసి తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడం వంటి ఆసక్తికరమైన అంశాలతో ‘సెల్యూట్’ రూపొందుతుందని తెలుస్తోంది.
