Dhurandhar 2: ధురంధర్ 2 ఫ్యాన్స్ కి షాక్.. ప్రీమియర్ షోస్ క్యాన్సిల్
ధురంధర్ 2 (Dhurandhar 2)ప్రీమియర్ షోస్ క్యాన్సిల్ క్యాన్సిల్ అయ్యాయి.
- V Santhosh Kumar
- Published On : March 18, 2026 / 12:06 PM IST
Durandhar 2 premieres have been cancelled.
Dhurandhar 2: రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్(Dhurandhar 2)’ విడుదల సమయంలో అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ సినిమాకు సంబంధించి మార్చి 18 సాయంత్రం నుంచే భారీగా పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. అయితే, అనూహ్యంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ ప్రీమియర్ షోలు రద్దు కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ షోలు క్యాన్సిల్ అయినట్లు సమాచారం.
Parthiban: ‘ఉస్తాద్..’ ఈవెంట్ లో కులం ప్రస్తావన.. క్షమాపణలు చెప్పిన పార్తిబన్.. అసలేం జరిగిందంటే?
సాంకేతిక కారణాల వల్ల, ముఖ్యంగా సినిమా కంటెంట్ డెలివరీలో జరిగిన జాప్యం, చివరి నిమిషంలో జరిగిన కొన్ని మార్పుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు సినిమా యాజమాన్యం డబ్బులను వెనక్కి ఇచ్చేస్తోంది. అయితే, కేవలం హిందీ వెర్షన్‌కు సంబంధించిన ప్రీమియర్స్ మాత్రం యథావిధిగా కొనసాగుతున్నట్లు సమాచారం.
