Ee Paata Korinavaaru Trailer : ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి’ ట్రైలర్ రిలీజ్.. అనిల్ రావిపూడి చేతుల మీదుగా..

తాజాగా హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి.. (Ee Paata Korinavaaru Trailer)

  • Updated on- September 16, 2026 / 10:19 AM IST

Ee Paata Korinavaaru Trailer

Ee Paata Korinavaaru Trailer : ఆ నలుగురు, మధుమాసం, అందరి బంధువయా, ఇదీ సంగతి, ఆటగదరా శివా.. లాంటి విలక్షణ సినిమాలతో మెప్పించిన దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. ఇటీవల తన సినిమా టైటిల్ ని ప్రకటించినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే చంద్ర సిద్ధార్థ్.. ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ అనే భారీ టైటిల్ తో సినిమాని ప్రకటించారు. పైగా దీనికి ఎ ఫర్‌బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా… అనే సబ్ టైటిల్ కూడా ఇచ్చారు. ఈ సినిమాలో హర్ష హీరోగా, అమైరా గోస్వామి, సుజనా రెడ్డి మెయిన్ లీడ్స్ లో నటించగా ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్‌ వర్ధన్, రేఖా నిరోషా లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రముఖ దర్శక రచయిత మదన్ అందించిన కథతో వై.వి.సత్యనారాయణ రాజు సమర్పణలో ఫిల్మోత్సవ్ బ్యానర్ పై చంద్ర సిద్ధార్థ్ దర్శక నిర్మాణంలో తెరకెక్కింది. ఈ సినిమా సెప్టెంబర్ 18న రిలీజ్ అవుతుండగా తాజాగా హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..

Also Read : Bigg Boss Wild Card Entry : చైత్ర, చరణ్.. ఇద్దరిలో ఒకరు కంబ్యాక్.. వైల్డ్ కార్డు ఎంట్రీ.. వాళ్ళ పీఆర్ టీమ్ బాగా పనిచేస్తుందిగా..

ఈ సినిమా ట్రైలర్ రిలిక్ అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. ఇంత పెద్ద టైటిల్‌తో సినిమా రావడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చంద్ర సిద్ధార్థ్ గారి దగ్గర మధుమాసం, హౌస్‌ఫుల్, అందరి బంధువయా సినిమాలకు చిత్రాలకు నేను స్క్రిప్ట్ విభాగంలో పని చేశాను. ఆయన చాలా సెన్సిబుల్ సినిమాలు తీశారు. ఈ పొడవాటి టైటిల్‌తో వస్తున్న సినిమా కూడా హిట్ అవ్వాలి అని అన్నారు.

దర్శక నిర్మాత చంద్ర సిద్దార్థ్ మాట్లాడుతూ.. మా సినిమా ట్రైలర్ విడుదల చేసిన అనిల్ రావిపూడి గారికి థాంక్స్. ఆయన బిజీ షెడ్యూల్‌లో మాకు కొంత టైమ్ ఇచ్చారు. టైటిల్ రెస్పాన్స్ బావుంది. టైటిల్ ఆడియన్స్ అందరిలో సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన థ్రిల్లర్ సినిమాల్లో ఇదొక డిఫరెంట్ సినిమా అవుతుంది అని అన్నారు.