Eesha Rebba : విశ్వక్ సేన్‌తో ఈషారెబ్బ ఐటెం సాంగ్ చేయాలి..? కానీ..
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.
- Thota Vamshi Kumar
- Published On : May 29, 2024 / 05:26 PM IST
Eesha Rebba -Vishwak Sen
Eesha Rebba – Vishwak Sen : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ మూవీ కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ సినిమాలో నేహశెట్టి కథనాయిక. అంజలి కీలక పాత్రలో నటిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం మే 31న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలతో పాటు ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. కాగా.. ఈ చిత్రంలో మోత అంటూ సాగే ఓ ఐటెం సాంగ్ ఉంది. విశ్వక్‌సేన్, హిందీ బిగ్‌బాస్ ఫేమ్ నటి అయేషా ఖాన్ లు కలిసి డ్యాన్స్ చేశారు. ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను ఇప్పటికే విడుదల చేయగా వీరిద్దరి స్టెప్పులు అదుర్స్ అనిపించేలా ఉన్నాయి.
Game Changer : గేమ్ ఛేంజర్ మళ్ళీ వాయిదా.. ఎన్టీఆర్ తో చరణ్ పోటీ? దేవర వర్సెస్ గేమ్ ఛేంజర్..?
అయితే.. వాస్తవానికి ఈ పాటకు విశ్వక్‌తో కలిసి ఈషా రెబ్బా చిందులు వేయాల్సి ఉంది. సాంగ్‌కు సంబంధించిన చిత్రీకరణకు సైతం ఈషా వచ్చిందట. అయితే స్టెప్పులు వేసేటప్పుడు ఈషాకు ఆరోగ్యం సహకరించలేదట. ఆమె కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారట. కాగా.. అప్పటికే సాంగ్‌కు సంబంధించిన సెట్టింగ్ మొత్తం వేసి ఉండడం, ఈషా కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉండడంతో ఆ సమయంలో హైదరాబాద్‌లో ఉన్న అయేషా తలుపు తట్టిందట ఈ అవకాశం. ఆమె ఎస్ అనడంతో వెంటనే చిత్రీకరణ ప్రారంభించి పూర్తి చేశారట. అలా ఈ పాటను ఈషా చేయలేకపోయిందట. ఒకవేళ ఈ పాట ఈషా రెబ్బా చేసుంటే ఆమె కెరీర్‌కు చాలా ఫ్లస్ అయ్యేదని అంటున్నారు.
