Eesha Rebba: తెలుగు హీరోయిన్ భుజంపై గాయం.. ఏమైంది?
- vamsi
- Published on- June 27, 2021 / 02:13 PM IST
Eesha Rebba
Eesha Rebba: తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా.. ప్రతిరోజూ ఫోటోషూట్ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తన కొన్ని అద్భుతమైన చిత్రాలను పంచుకోవడం ద్వారా ఆమె తన అభిమానులను ఇన్‌స్టాగ్రామ్‌లో అలరిస్తూ ఉంటుంది. ట్విట్టర్‌లో కూడా ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే ఈ అమ్మడు..లేటెస్ట్‌గా శనివారం షేర్ చేసి ఫోటో షాకింగ్‌గా అనిపిస్తోంది.
ఈ తాజా ఫోటోషూట్‌లో ఆమె స్లీవ్ లెస్ దుస్తుల్లో కనిపించగా.. ఒక వైపు ఆమె భుజంపై గాయమైన గుర్తు కనిపిస్తోంది. అది గమనించిన ఫాలోవర్స్.. అభిమానులు.. ఏమైంది? అని అడగుతున్నారు. ఆమె ఎలా గాయపడింది? అని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఎడమ భుజంపై ఎర్రగా కందిన గాయం నిజంగా గాయమేనా? లేక ఏదైనా మచ్చనా? తెలియట్లేదు. దీనిపై ఆమె ఎటువంటి వివరణ కూడా ఇవ్వలేదు.
మరికొందరు మాత్రం ఆ గాయం వ్యాక్సినేషన్ కారణంగా వచ్చిన బొప్పి వల్ల పుట్టిన మచ్చ అయ్యి ఉంటుందని, కొందరైతే ఆ మచ్చ మాత్రం వ్యాక్సినేషన్ వల్ల వచ్చినది కాదని కామెంట్ చేస్తున్నారు. అరవింద సమేత, ఇలా పలు సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో కనిపించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం తమిళ్‌లో రెండు చిత్రాలు.. మలయాళంలో ఒక సినిమా చేస్తోంది.
