Ego Raja : ఈగో రాజా ఆది సాయి కుమార్ ‘రౌడీ రాకాసి పిల్ల..’ సాంగ్ విన్నారా?
ఇటీవల ఈ సినిమా నుంచి 'రౌడీ రాకాసి పిల్ల ఇది..’ అంటూ సాగే ఓ క్యూట్ లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. (Ego Raja)
- Saketh U
- Published on- November 9, 2026 / 06:37 PM IST
Ego Raja
Ego Raja : శంబాల బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ ఈగో రాజా అనే సినిమాతో రాబోతున్నాడు. ఆది సాయి కుమార్, సతీష్, శరణ్య రామచంద్రన్, ఆద్య ప్రసాద్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ఈగో రాజా. ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సురేష్ నిర్మాణంలో గురు శరవణన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో ఆది కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా నుంచి ‘రౌడీ రాకాసి పిల్ల ఇది..’ అంటూ సాగే ఓ క్యూట్ లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. లుంగీలో ఆది మాస్ స్టెప్స్ తో అదరగొట్టాడు ఈ పాటలో. గిబ్రాన్ వైబోధ సంగీత దర్శకత్వంలో ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా శిభి శ్రీనివాసన్ పాడారు. మీరు కూడా ఈ పాటను వినేయండి..
Also See : Rahul Sipligunj : భార్యతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ దీపావళి సెలబ్రేషన్స్.. ఫోటోలు చూశారా..?
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
