RRR : ‘ఆర్ఆర్ఆర్’ ఒక అద్భుతమైన మూవీ.. హాలీవుడ్ పాప్ సింగర్.. జపాన్‌లో ఇంకా తగ్గని క్రేజ్..

'ఆర్ఆర్ఆర్' ఒక అద్భుతమైన మూవీ అంటూ హాలీవుడ్ పాప్ సింగర్ కామెంట్స్. జపాన్ లో ఇంకా తగ్గని క్రేజ్..

English Pop Singer Ed Sheeran comments about RRR movie

RRR : రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల వరల్డ్ సెన్సేషన్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అయ్యి రెండేళ్లు గడిచిపోతుంది. అయినాసరి ఈ సినిమా సృష్టించిన మ్యానియా ఇంకా కొనసాగుతూనే ఉంది. అది కూడా టాలీవుడ్ లో కాదు, హాలీవుడ్ లోనే ఎక్కువ వినిపిస్తుంది. మొన్న ఈమధ్య జరిగిన ఓ అవార్డుల వేడుకల్లో ఈ సినిమా గురించి జేమ్స్ కామెరాన్ మాట్లాడం, ఆ తరువాత పాకిస్తాన్ మీడియాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ గురించి మాట్లాడం చూసాము.

ఇక ఇటీవల ఆస్కార్ వేదిక పై మరోసారి ఆర్ఆర్ఆర్ కనిపించి టాలీవుడ్ ఆడియన్స్ ని ఫుల్ ఖుషి చేసింది. ఇప్పుడు తాజాగా ఓ హాలీవుడ్ పాప్ సింగర్ ‘ఆర్ఆర్ఆర్’ గురించి మాట్లాడుతూ.. అద్భుతమైన ఫిలిం అంటూ చెప్పుకొచ్చారు. హాలీవుడ్ పాప్ రంగంలో వన్ ఆఫ్ ది టాప్ సింగర్ గా రాణిస్తున్న ‘ఎడ్ షీరన్’ (Ed Sheeran).. ప్రస్తుతం కొన్నిరోజుల నుంచి బాలీవుడ్ లో సందడి చేస్తున్నారు.

Also read : Allu Arjun : అల్లు అర్జున్, అట్లీ సినిమా వర్క్ స్టార్ట్.. త్రివిక్రమ్ మూవీ లేనట్లేనా..!

ఈక్రమంలోనే బాలీవుడ్ స్టార్స్ తో కలిసి డాన్స్ వేయడం, ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి చేస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎడ్ షీరన్ మాట్లాడుతూ.. “నా ఫ్రెండ్స్ తో కలిసి నేను ఆర్ఆర్ఆర్ సినిమా చూసాను. అది చాలా అద్భుతమైన సినిమా. టెక్నికల్ గా ప్రతి విషయంలో ఆ సినిమా నన్ను ఆకట్టుకుంది. ముఖ్యంగా నాటు నాటుకి వేసిన డాన్స్ అద్భుతం” అంటూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్ టీం కూడా ఈ వీడియోని రీ ట్వీట్ చేస్తూ షేర్ చేసింది. ఇది ఇలా ఉంటే, రాజమౌళి మార్చి 18న జపాన్ వెళ్ళబోతున్నారు. అక్కడ ఆర్ఆర్ఆర్ స్పెషల్ స్క్రీనింగ్ అటెండ్ కానున్నారు. జపాన్ లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి ఏడాదిన్నర అవుతుంది. అయినా ఇంకా షోలు పడుతూనే ఉన్నాయి. ఇక 18న రాజమౌళి అటెండ్ కాబోయే స్పెషల్ స్క్రీనింగ్ టికెట్స్ అయితే కేవలం 1 నిమిషంలోనే ఆల్మోస్ట్ అన్ని అమ్ముడుపోయాయి. దీన్నిబట్టే తెలుస్తుంది జపాన్ ఆడియన్స్ లో ఆర్ఆర్ఆర్ కి ఎంతటి క్రేజ్ ఉందో.

ట్రెండింగ్ వార్తలు