Ester Noronha: ఇకమీదట అలాంటి పాత్రలు చేయను.. చచ్చిపోయినట్టు అనిపించింది.. డబ్బుకోసం ఒప్పుకోలేను
సినీ నటి ఎస్తేర్ నొరోన్హా(Ester Noronha) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు.
- V Santhosh Kumar
- Published On : April 9, 2026 / 06:21 PM IST
Esther Shocking Comments About Her Career
- వదిన పాత్రలో నటించడం చనిపోయినట్లు అనిపించింది
- హీరోయిన్ల పాత్రలు గ్లామర్‌కే పరిమితమా?
- సినీ ఇండస్ట్రీపై ఎస్తేర్ నొరోన్హా బ్యూటీ ఫైర్.
Ester Noronha: సినీ నటి ఎస్తేర్ నొరోన్హా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. ‘భీమవరం బుల్లోడు’ సినిమా తర్వాత తన కెరీర్ ఆశించిన స్థాయిలో సాగకపోవడానికి కేవలం కథల ఎంపికే కారణం కాదని, ఇండస్ట్రీలోని కలుషిత వాతావరణం కూడా ప్రధాన కారణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన మనస్తత్వానికి విరుద్ధంగా ఉండే షరతులతో వంద సినిమాలు చేయడం కంటే, ఆత్మసంతృప్తినిచ్చే సినిమాలు చేయడమే ఉత్తమం అని ఆమె స్పష్టం చేశారు.
Nayanthara- Vignesh shivan: నయన్- విఘ్నేష్ తిరుమల యాత్ర.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు
హీరోయిన్ల పాత్రలు కేవలం గ్లామర్ ప్రదర్శనకే పరిమితం అవుతున్నాయని, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు కరువయ్యాయని ఎస్తేర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ‘జయ జానకి నాయక’ సినిమాలో నటించిన అనుభవం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆమె వెల్లడించారు. ఆ చిత్రంలో వదిన పాత్రలో కేవలం అందంగా కనిపించి, అందరితో కలిసి ఏడ్చే సీన్లకే పరిమితం కావడం తన నటన చచ్చిపోయినట్లు అనిపించిందని, ఆ సమయంలో తనకు ఏమాత్రం జాబ్ సాటిస్‌ఫాక్షన్ లభించలేదని అన్నారు.
పెద్ద బ్యానర్ల నుండి అక్క, వదిన వంటి ఆఫర్లు వచ్చినప్పటికీ, వాటిని తిరస్కరిస్తున్నట్లు ఎస్తేర్ తెలిపారు. కేవలం డబ్బు (Ester Noronha)కోసం తనలోని నటిని చంపుకోలేనని, ప్రాధాన్యత ఉన్న పాత్రలకే మొగ్గు చూపుతానని ఆమె స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలో మహిళలపై ఉండే డిమాండ్లు, స్కిన్ షో వంటి అంశాల కంటే ప్రతిభకు గుర్తింపు దక్కాలని ఆమె కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఎస్తేర్ చేసిన ఈ కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
