Vijay Pawan Kalyan : విజయ్ సీఎం అయినా.. ఆ రికార్డ్ మాత్రం పవన్ కళ్యాణ్‌దే..

విజయ్ సీఎం అయినా ఒక రికార్డ్ మాత్రం పవన్ కళ్యాణ్ దే అంటున్నారు.(Vijay Pawan Kalyan)

Vijay Pawan Kalyan

Vijay Pawan Kalyan : తమిళ్ స్టార్ హీరో విజయ్ TVK పార్టీ పెట్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసారు. నేడు వెల్లడవుతున్న ఫలితాల్లో అనూహ్యంగా విజయ్ అధికారం దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే విజయ్ 105 కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పూర్తి ఆధిక్యం వచ్చినా, హంగ్ వచ్చినా తమిళనాడు సీఎం మాత్రం విజయ్ అవ్వడం ఖాయం అని విశ్లేషిస్తున్నారు.

అయితే విజయ్ సీఎం అయినా ఒక రికార్డ్ మాత్రం పవన్ కళ్యాణ్ దే అంటున్నారు. అదే 100 శాతం స్ట్రైక్ రేట్. జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో అసెంబ్లీ కి 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాలను గెలుచుకుంది. పార్లమెంట్ కి 2 స్థానాలు పోటీ చేసి రెండు స్థానాలను గెలుచుకుంది. అలా దేశంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా అవతరించింది జనసేన.

Also Read : Vishal TVK: విజయ్ పార్టీలో చేరనున్న విశాల్.. గతంలో చెప్పినట్టే.. ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లోకి..?

ఇప్పుడు విజయ్ TVK పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాల్లో పోటీ చేసింది. ఇప్పటివరకు విజయ్ దాదాపు 105 సీట్స్ లో ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. మిగతా స్థానాల్లో డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు గెలవనున్నాయి. విజయ్ సీఎం అయినా వంద శాతం స్ట్రైక్ రేట్ మాత్రం సాధించే అవకాశం మాత్రం లేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి వందశాతం స్ట్రైక్ రేట్ సాధించిన రికార్డ్ మాత్రం పవన్ కళ్యాణ్ జనసేన పేరు మీదే ఉండనుంది.