థియేటర్స్ పెరుగుతున్నాయ్

సంక్రాంతి అల్లుళ్ళుగా వెంకీ, వరుణ్‌ల స్పీడ్ బాక్సాఫీస్ దగ్గర మరికొన్ని రోజులు కంటిన్యూ కానుంది.

  • Publish Date - January 24, 2019 / 05:48 AM IST

సంక్రాంతి అల్లుళ్ళుగా వెంకీ, వరుణ్‌ల స్పీడ్ బాక్సాఫీస్ దగ్గర మరికొన్ని రోజులు కంటిన్యూ కానుంది.

విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్‌వరుణ్ తేజ్ హీరోలుగా, మిల్కీబ్యూటీ తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్‌లో వచ్చిన ఎఫ్2 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ, ఫన్ కలగలసిన సినిమా కావడంతో, ఎఫ్2కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అన్ని ఏరియాల్లోనూ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తున్న ఎఫ్2, యూఎస్‌లోనూ భారీ వసూళ్ళు రాబడుతుంది. దాదాపు రూ.35 కోట్ల వరకూ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పటి వరకూ దాదాపు రూ. 65 కోట్ల షేర్ దాటేసి, 100 కోట్ల క్లబ్‌లో ఎంటర్ కాబోతుంది.

ఇదిలా ఉంటే, ఎఫ్2కి రేపటినుండి మరికొన్ని థియేటర్స్ యాడ్ అవబోతున్నాయి. నైజాం ఏరియాలో ఈ శుక్రవారం (25 జనవరి) నుండి, అదనంగా మరో 70 థియేటర్లు పెంచుతున్నారు. సంక్రాంతికి రిలీజ్ అయిన మిగతా సినిమాలు ఆడియన్స్‌ని అంతగా ఆకట్టుకోకపోవడం, సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ఎఫ్2కి ఫ్లోటింగ్ ఇంకా తగ్గక పోవడంతో థియేటర్స్ పెంచుతున్నారు. సంక్రాంతి అల్లుళ్ళుగా వెంకీ, వరుణ్‌ల స్పీడ్ బాక్సాఫీస్ దగ్గర మరికొన్ని రోజులు కంటిన్యూ కానుంది.

వాచ్ ఎఫ్2 ట్రైలర్…