ముంబైలో ప్రారంభమైన ‘ఫైటర్’

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్‌ల ‘ఫైటర్’ ముంబైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

  • Publish Date - January 20, 2020 / 05:22 AM IST

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్‌ల ‘ఫైటర్’ ముంబైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేయనున్న ‘ఫైటర్’ మూవీ సోమవారం ముంబైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మిలతో కలిసి కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

‘ఫైటర్’  చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్‌ థాయ్‌లాండ్‌లో మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ‘ఫైటర్’ విజయ్ దేవరకొండ 10వ సినిమా, పూరికి 37వ సినిమా కావడం విశేషం. విజయ్ దేవరకొండపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చార్మి క్లాప్ నిచ్చారు.

Read Also : నరేష్‌ని ఎప్పుడూ ఇలా చూసుండరు – ‘నాంది’ కొత్తగా ఉందే!

విజయ్, పూరి, చార్మితో సహా పలువురు యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయ్ పక్కన అనన్య పాండే కథానాయికగా నటించనుందని వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫిబ్రవరి 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ‘ఫైటర్’ రెగ్యులర్ షూటింగ్ నేటి నుండే జరుగుతుంది. సమర్పణ : ధర్మ ప్రొడక్షన్స్, నిర్మాతలు : కరణ్ జోహార్, పూరి జగన్నాధ్, చార్మి.