×
Ad

Filmfare 2026: 70వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ వేడుక.. తెలుగు సినిమాల నామినేషన్స్ ఇవే

ఫిలిం ఫేమ్ అవార్డ్స్ 2026(Filmfare 2026) తెలుగు నామినేషన్స్ లిస్ట్ విడుదల అయ్యింది.

Filmfare Awards 2026 telugu nominations list

Filmfare 2026; సౌత్ సినిమా ఇండస్ట్రీలు ఘనంగా జరుపుకునే అత్యంత ప్రతిష్టాత్మకమైన 70వ ఫిల్మ్‌ఫేర్‌- 2026 అవార్డుల వేడుకకు కి రంగం సిద్ధం అయ్యాయంది. ఫిబ్రవరి 21న ఈ అవార్డుల వేడుకలు ఘనంగా జరుగనుంది. ఈ అవార్డుల(Filmfare 2026) కోసం తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఇండస్ట్రీల నుంచి పలు చిత్రాలు పోటీ పడుతున్నాయి. 2024లో విడుదలైన చిత్రాలకు గాను ఈ అవార్డులు ప్రధానం చేయనున్నారు. దీనికి సంబందించిన నామినేషన్స్ లిస్టును కూడా విడుదల చేశారు. వాటిలో తెలుగులో సినిమాల నామినేషన్స్ లిస్టు ఇక్కడ చూడొచ్చు.

ఉత్తమ చిత్రం:

  • హనుమాన్‌
  • కల్కి 2898 ఏడీ
  • లక్కీ భాస్కర్‌
  • పుష్ప : ది రూల్‌
  • 35 చిన్న క‌థ కాదు
  • కమిటీ కుర్రోళ్లు

ఉత్తమ దర్శకుడు:

  • సుకుమార్ (పుష్ప : ది రూల్‌)
  • నాగ్‌ అశ్విన్‌ (కల్కి 2898 ఏడీ)
  • ప్రశాంత్‌ వర్మ (హనుమాన్‌)
  • వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌)
  • నంద కిశోర్‌ (35 చిన్న క‌థ కాదు)
  • యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)

ఉత్తమ నటుడు:

  • ఎన్టీఆర్‌ (దేవర)
  • అల్లు అర్జున్‌ (పుష్ప : ది రూల్‌)
  • నాని (సరిపోదా శనివారం)
  • తేజ సజ్జ (హనుమాన్‌)
  • దుల్కర్‌ సల్మాన్‌ (లక్కీ భాస్కర్‌)
  • సిద్ధూ జొన్నలగడ్డ (టిల్లు స్క్వేర్‌)

ఉత్తమ నటి:

  • రష్మిక (పుష్ప : ది రూల్‌)
  • అనుపమ పరమేశ్వరన్‌ (టిల్లు స్క్వేర్‌)
  • ప్రియాంక మోహన్‌ (సరిపోదా శనివారం)
  • ఆషికా రంగనాథ్‌ (నా సామిరంగ)
  • మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్‌)
  • నివేదా థామస్‌ (35 చిన్న క‌థ కాదు)

ఉత్తమ సహాయ నటుడు:

  • ఫహద్‌ ఫాజిల్‌ (పుష్ప : ది రూల్‌)
  • అమితాబ్‌ బచ్చన్‌ (కల్కి 2898 ఏడీ)
  • ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
  • వినయ్‌ రాయ్‌ (హనుమాన్‌)
  • ధనంజయ్‌ (జీబ్రా)
  • సత్య (మత్తు వదలరా 2)

ఉత్తమ సహాయ నటి:

  • వరలక్ష్మి శరత్‌కుమార్‌ (హనుమాన్‌)
  • అంజలి (గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి)
  • ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)
  • శరణ్య ప్రదీప్‌ (అంబాజీపేట మ్యారేజీ బ్యాండు)
  • శ్రద్ధా శ్రీనాథ్‌ (మెకానిక్‌ రాకీ)
  • రషి సింగ్‌ నందు (ప్రసన్నవదనం)