Akhil Fan : మొత్తానికి అయ్యగారిని కలిసిన వీరాభిమాని.. కాళ్ళ మీద పడి ఏడ్చేసి.. వీడియో వైరల్..

అతను ఎంతగా ఫేమస్ అయ్యాడంటే ఏకంగా నాగార్జున స్టేజి మీద అతనికి థ్యాంక్స్ చెప్పే రేంజ్ లో వైరల్ అయ్యాడు. (Akhil Fan)

  • Published on- July 16, 2026 / 06:28 AM IST

Akhil Fan

Akhil Fan : అయ్యగారి నెంబర్ 1 అంటూ గతంలో అఖిల్ సినిమాకు ఓ అక్కినేని వీరాభిమాని చేసిన హడావిడి వైరల్ గా మారింది. దీంతో అఖిల్ పేరు ఏకంగా అయ్యగారు అని ఫ్యాన్స్ సరదాగా పిలుచుకుంటున్నారు. అఖిల్ సినిమా ఎప్పుడొచ్చినా, నాగార్జున సినిమా ఎప్పుడొచ్చినా ఆ వీరాభిమాని థియేటర్ వద్దకు వచ్చి హంగామా చేస్తాడు. ఆ వీరాభిమాని పేరు నాగరాజు. ఇన్నాళ్లకు అఖిల్ లెనిన్ హిట్ కొట్టడంతో మరోసారి థియేటర్ వద్ద నాగరాజు సందడి చేసాడు.

అతను ఎంతగా ఫేమస్ అయ్యాడంటే ఏకంగా నాగార్జున స్టేజి మీద అతనికి థ్యాంక్స్ చెప్పే రేంజ్ లో వైరల్ అయ్యాడు. దీంతో ఆ వీరాభిమాని ఎప్పుడు అఖిల్ ని, నాగార్జునను కలుస్తాడు అని అంతా అనుకున్నారు. నాగరాజు గుంటూరులో ఓ సాధారణ పండ్ల వ్యాపారి. తోపుడు బండిపై పండ్లు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తాడు. తన భార్య, కూతురుతో ఓ చిన్న ఇంట్లో ఉంటాడు. ఒకప్పుడు నాగార్జునకు వీరాభిమాని. అక్కినేని హీరోల సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం థియేటర్ వద్ద సందడి చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ తన పని తాను చేసుకుంటాడు.

Also Read : Zainab Ravdjee Akhil : మొదటిసారి సినిమా ఈవెంట్లో అఖిల్ భార్య.. జైనబ్ రవ్జీ-అఖిల్ క్యూట్ ఫొటోలు వైరల్..

తాజాగా లెనిన్ సక్సెస్ మీట్ గుంటూరులో నిర్వహించారు. అఖిల్ తో పాటు మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు. ఈవెంట్ అయ్యాక నాగరాజుని అఖిల్ కలిశారు. తన కారవాన్ లోనే అఖిల్ ఆ వీరాభిమానిని కలిశారు. అఖిల్ ని చూడగానే నాగరాజు అఖిల్ కాళ్ళ మీద పడిపోయి ఏడ్చేశాడు. అఖిల్ పైకి లేపి హత్తుకున్నాడు. నాగరాజు అతన్ని హత్తుకొని ఏడ్చేశాడు.

నాగరాజు అఖిల్ ని కలిసి.. అయ్యగారే నెంబర్ 1. మీరు ఇంకా పైకి ఎదగాలి అని అన్నారు. అఖిల్ కూడా ఇప్పుడు హ్యాపీనేనా అంటూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో నాగరాజుని అఖిల్ కలిసి హత్తుకొని మాట్లాడిన వీడియోలు వైరల్ గా మారాయి. మొత్తానికి సోషల్ మీడియా వల్ల ఓ వీరాభిమాని తన హీరోని కలిసాడు అని అంతా అంటున్నారు. మీరు కూడా ఆ వీడియో చూసేయండి.