కరోనా కాలంలో పెళ్లిళ్లతో సహా ఇతరత్రా శుభకార్యాలు వాయిదా వేసుకుంటే మంచిదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సెలవిస్తున్నాయి. తప్పదు అనుకుంటే.. 20 మందికి మించకుండా పెళ్లి వంటి తతంగాలు పూర్తి చేయాలని షరతులు విధించాయి. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఓ జంట అంగరంగ వైభవంగా వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. తమ స్టేటస్‌కి తగ్గట్టు ఈ వేడుకకు ఎంతో మంది అతిథులను ఆహ్వానించేందుకు కూడా రెడీ అయిపోయారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం వద్దని నచ్చచెప్పాల్సింది పోయి ప్రముఖ కన్నడ యాంకర్ అకుల్ బాలాజీ వారికి అండగా నిలిచాడు. మీకెందుకు నేను చూసుకుంటానంటూ బెంగుళూరులోని తన రిసార్ట్‌ను వివాహానికి వేదికగా ఫిక్స్ చేశాడు. లాక్‌డౌన్ నిబంధనలను లెక్కచేయకుండా పెళ్లికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నాడు.
దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా అకుల్ బాలాజీ కన్నడలో ‘మానే ముండే మహాలక్ష్మి’, ‘ప్యాతే హుద్గిర్ హల్లీ లిఫు సీజన్ 1&2’, ‘హోసా లవ్ స్టోరీ’ వంటి పలు రియాలిటీ షోలతో వ్యాఖ్యాతగా పాపులర్ అయ్యాడు. తెలుగులో “పెళ్లి ప్రమాణాలు” అనే సీరియల్‌లో నటించగా, “312గో” అనే షోలో యాంకర్‌గా కనిపించాడు. అకుల్ చేసిన పనికి కన్నడ నాట అతగాడిపై పలు విమర్శలు వస్తున్నాయి.