Telugu Indian Idol : తెలుగు ఇండియన్ ఐడల్ క్రేజ్ అమెరికాలో కూడా.. ఆహా సింగింగ్ షో ఈవెంట్..

తాజాగా ఈ షో ఈవెంట్ నిర్వహించగా జడ్జీలు, హోస్ట్ లు, నిర్మాత అల్లు అరవింద్ పాల్గొన్నారు.(Telugu Indian Idol)

Telugu Indian Idol : తెలుగు ఇండియన్ ఐడల్ క్రేజ్ అమెరికాలో కూడా.. ఆహా సింగింగ్ షో ఈవెంట్..

Telugu Indian Idol

Updated On : September 10, 2025 / 7:48 PM IST

Telugu Indian Idol : తెలుగు అతి పెద్ద సింగింగ్ షో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఆహా ఓటీటీలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం 7 గంటలకు ఆహాలో కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ షోలో తమన్, కార్తీక్, గీతా మాధురి జడ్జెస్ గా ఉండగా శ్రీరామచంద్ర, సమీరా భరద్వాజ్ లు హోస్ట్ గా ఉన్నారు. తాజాగా ఈ షో ఈవెంట్ నిర్వహించగా జడ్జీలు, హోస్ట్ లు, నిర్మాత అల్లు అరవింద్ పాల్గొన్నారు.

తెలుగు ఇండియన్ ఐడల్

ఈవెంట్ లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 అద్భుతంగా వచ్చింది. మీరు బాగా చేస్తానంటేనే సీజన్ 4కు ఇన్వెస్ట్ మెంట్ పెడదాం అని అన్నాను. ఇండియన్ ఐడల్ వారికి ప్రతి సీజన్ కు డబ్బు ఇచ్చి రైట్స్ తీసుకోవాలి. ఇందుకు తమన్ కు థ్యాంక్స్ చెప్పాలి. షోలో స్కూల్ లో చదువుతున్న పిల్లలు కూడా వచ్చి బాగా పాడుతున్నారు. ఇతర రాష్ట్రాల పిల్లలు తెలుగు నేర్చుకుని పాడుతున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ క్రేజ్ ఎంతలా ఉందంటే అమెరికాలో ఈ కార్యక్రమాన్ని చూస్తూ అక్కడి నుంచి కంటెస్ట్ చేసేందుకు వస్తున్నారు. మనం గల్లీ టు ఢిల్లీ అంటాం కానీ ఇది గల్లీ టు గ్లోబల్ అయ్యింది. ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ షో చేస్తున్నందుకు గర్వంగా ఉంది అని అన్నారు.

Also Read : Sunjay Kapoor : 1900 కోట్లు ఇచ్చాం.. ఇంకా ఎంత కావాలి? బిజినెస్ మెన్ ఆస్తి కోసం గొడవలు.. హీరోయిన్ పిల్లలపై..

 

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. తెలుగు ఇండియన్ ఐడల్ చేసే అవకాశాన్ని కల్పించింది అల్లు అరవింద్ గారు, త్రివిక్రమ్ గారు. ఈ షో మాలో ఒక కొత్త మార్పు తీసుకొచ్చింది. దాదాపు 6 వేల మంది కంటెస్టెంట్స్ నుంచి 12 మందిని సెలెక్ట్ చేయడం అంటే ఎంత టాలెంట్ పోటీ పడిందో అర్థం చేసుకోవచ్చు. ఈ షో తర్వాత మేము మ్యూజిక్ కన్సర్ట్స్ కు వెళ్తే ఇండియన్ ఐడల్ లో బాగా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. మా కన్సర్ట్స్ కు హాజరయ్యే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది. నేను చేసిన సినిమాలు వాళ్ల ఇంటిదాకా తీసుకెళ్తే, ఈ షో నన్ను ప్రేక్షకుల ఇంట్లోకి తీసుకెళ్లింది. తెలుగు ఇండియన్ ఐడల్ కు పనిచేయడం ఒక బాధ్యతగా, గౌరవంగా భావిస్తున్నాం. ఈ షోలో డల్లాస్ నుంచి కూడా కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఈ షోను ఆర్గనైజ్ చేయబోతున్నాం. అందుకే గల్లీ టు గ్లోబల్ అనే క్యాప్షన్ పెట్టాం. కంటెస్టెంట్స్ పాడటం ఒక్కటే కాదు వారి కుటుంబ సభ్యుల భావోద్వేగాలు, ఇక్కడ గెలుపు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేవి అన్నీ క్యాప్చర్ చేస్తున్నాం అని తెలిపారు.

సింగర్ గీతా మాధురి మాట్లాడుతూ.. ఇది మూడోసారి వరుసగా నేను ఈ కార్యక్రమానికి జడ్జ్ గా చేస్తున్నాను. నేను కూడా రియాల్టీ షోస్ లో పాడే సింగర్ గా ఎదిగాను. ఇప్పుడు ఈ కంటెస్టెంట్స్ ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లు ఉంటోంది అని తెలిపింది.

Also See : Ritika Nayak : ‘మిరాయ్‌’ భామ రితిక నాయక్.. ఎంత క్యూట్ గా ఉందో..