Five films from Mega family coming this summer season.
Mega Movies: సంక్రాంతి 2026 సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఏకంగా రూ.375 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక సంక్రాంతి సీజన్ ముగియడంతో ఇప్పుడు అందరి కన్ను సమ్మర్ మీద పడింది. వరుసగా సినిమాలన్నీ సమ్మర్ విడుదలకు సిద్ధం అవుతున్నాయి.
అయితే ప్రస్తుతం ఉన్న సిచువేషన్ చూస్తుంటే ఈ సమ్మర్ కి కూడా మెగా(Mega Movies) డామినేషన్ క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకంటే, మెగా ఫ్యామిలీ నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో మెగాస్టార్, రామ్ చరణ్ లాంటి వాళ్ళు కూడా ఉండటం విశేషం. ఇక ఈ సమ్మర్ సీజన్ ను మెగా ఫ్యామిలీ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదలుపెట్టనున్నాడు.
Anaganaga Oka Raju OTT: ఓటీటీలోకి ‘అనగనగా ఒక రాజు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆయన హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 26న విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆతరువాత మెగా డాటర్ నిహారిక రంగంలోకి దిగనుంది. ఆమె నిర్మాతగా ఉన్న రాకాస సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్నాడు. ఆ తరువాత మెగా పవర్ స్టార్ టైం స్టార్ట్ అవుతుంది. ఆయన హీరోగా వస్తున్న పెద్ది సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న మరో భారీ సినిమా విశ్వంభర. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్నాడు. భారీ గ్రాఫిక్స్ తో వస్తున్న ఈ సినిమాను జులై లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట మేకర్స్. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ లో మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను కూడా సమ్మర్ లో విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇలా ఒకే సీజన్ లో మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా ఐదు సినిమాలు రావడం అనేది విశేషం అనే చెప్పాలి. మరి ఈ సినిమాలల్లో ఏ సినిమాకు ఆడియన్స్ ఏ రేంజ్ రెస్పాన్స్ ఇస్తారు అనేది చూడాలి.