Gaddar Film Awards: ప్రతిభకు పట్టం కట్టేలా గద్దర్ అవార్డ్స్.. ఉగాదికి ప్రదానోత్సవం: భట్టి విక్రమార్క
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల(Gaddar Film Awards) కమిటీతో నేడు(ఫిబ్రవరి 4) ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.
- V Santhosh Kumar
- Published On : February 4, 2026 / 08:38 PM IST
Gaddar Awards ceremony will be held on Ugadi.
- గద్దర్ అవార్డుల కమిటీతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ
- ఉగాది రోజున అవార్డుల ప్రధానోత్సవం
- సినీ రంగ అభివృద్దే ప్రభుత్వ ఆలోచన అంటూ సూచన
Gaddar Film Awards: తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేడు(ఫిబ్రవరి 4) గద్దర్ ఫిల్మ్ అవార్డుల కమిటీతో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో ఆయన పలు అంశాలపై కమిటీతో చర్చించారు. అనంతరం 2026 ఉగాది సందర్భంగా మార్చి 19న గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నట్లుగా వెల్లడించారు. ఇక ఈ అవార్డులకు సంబంధించి చిత్రాల స్క్రీనింగ్ ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మొదలుకానుంది.
ఈ సందర్బంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. భారతీయ సినీ రంగానికి హైదరాబాదును కేంద్రంగా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. దానికి సంబందించిన బ్లూ ప్రింట్‌ను ప్రభుత్వం తయారు చేస్తోంది. సమాజం కోసం కళల ద్వారా తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు గద్దర్. కేవలం ప్రతిభ, పారదర్శకత ప్రాధాన్యంగా మాత్రమే గద్దర్ అవార్డుల(Gaddar Film Awards) ఎంపిక జరుగుతుంది.
గత సంవత్సరం జ్యూరీ సభ్యులు అవార్డుల ఎంపికను గొప్పగా నిర్వహించారు. ఈ అవార్డుల ఎంపికలో కేవలం వాణిజ్య అంశాలే కాకుండా సామాజిక అంశాలు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఆలా చేస్తేనే రాబోయే రోజుల్లో మంచి సినిమాలకు ప్రత్సాహకం లభిస్తుంది. ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో ఈ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది” అంటూ చెప్పుకొచ్చారు.
