Gaddar : గద్దర్ నటించిన చివరి సినిమా ‘ఉక్కు సత్యాగ్రహం’.. రిలీజ్ ఎప్పుడంటే..

గద్దర్ నటించిన చివరి సినిమా 'ఉక్కు సత్యాగ్రహం' రిలీజ్ డేట్ తాజాగా ప్రకటించారు.

  • Published On : August 8, 2024 / 07:09 AM IST

Gaddar Last Movie Ukku Satyagraham Release Date Announced

Gaddar : విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదంతో సత్యారెడ్డి హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తెరకెక్కించిన సినిమా ఉక్కు సత్యాగ్రహం. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఉక్కు సత్యాగ్రహం సినిమా ప్రెస్ మీట్ కు నిర్మాత బి.నర్సింగరావు, తెలంగాణా రాష్ట్ర గీతం రూపశిల్పి అందేశ్రీ, గద్దర్ తనయుడు సూర్యం, గోరేటి వెంకన్న, ప్రొఫెసర్ కోదండరాం, అల్లం నారాయణ.. పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సినిమాని ఆగస్టు 30 రిలీజ్ చేస్తారని ప్రకటించారు. ఈ సినిమాలో గద్దర్ మూడు పాటలు పాడి రెండు పాటల్లో, కొన్ని సందేశాత్మక సీన్స్ లో నటించారని తెలిపారు.

Also Read : Balakrishna : బాలకృష్ణ 50 ఏళ్ళ నట ప్రస్థానం వేడుకలు షురూ..

ఈ సందర్భంగా సినిమా దర్శక, నిర్మాత, నటుడు సత్యారెడ్డి మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఈ ఉక్కు సత్యాగ్రహం సినిమా చేసాము. స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్స్, ఎంప్లాయిస్, భూనిర్వాసితులు, పలువురు కవులు.. ఇలా అనేకమంది ఈ సినిమాలో నటించారు. ఢిల్లీ ఇండియా గేట్, జంతర్ మంతర్, ఆంధ్రప్రదేశ్ భవన్, సింగరేణి కోల్ మైన్స్, విశాఖపట్నం ప్రాంతాల్లోని వివిధ లొకేషన్ లలో ఈ సినిమా షూట్ చేసాం. ఆగస్టు 30న ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేస్తాం అని తెలిపారు..