×
Ad

Gangubai Kathiawadi : RRR ఎఫెక్ట్.. వెనక్కి తగ్గిన ‘గంగూబాయి’.. రాజమౌళి థ్యాంక్స్..

అలియా భట్ - సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘గంగూబాయి కథియావాడి’.. రిలీజ్ డేట్ మార్పు..

  • Published On : November 15, 2021 / 03:25 PM IST

Gangubai Kathiawadi

Gangubai Kathiawadi: పాండమిక్ తర్వాత బాక్సాఫీస్ బరిలో కొత్త సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో క్లాష్ తప్పడం లేదు. అందులోనూ పాన్ ఇండియా సినిమాలు ఐదు భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ అవుతాయి కాబట్టి థియేటర్ల విషయంలో సమస్య తప్పదు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఈ ఇబ్బంది తప్పడం లేదు.

Divyavani : ‘బుల్లెట్ బండి’ సాంగ్‌కి స్టెప్స్ ఇరగదీసిన సీనియర్ నటి దివ్యవాణి..

అలియా భట్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన సినిమా ‘గంగుబాయి కథియావాడి’.. (మాఫియా క్వీన్).. గంగూబాయి జీవితం ఆధారంగా రాసిన ‘మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై’ అనే పుస్తకాన్ని బేస్ చేసుకుని ఆమె జీవిత కథనే సినిమాగా తెరకెక్కిస్తున్నారు. 2022 జనవరి 6న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.

Akhanda Trailer Roar : ఇదీ బాలయ్య మాస్ ర్యాంపేజ్!

కట్ చేస్తే.. మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) 2022 జనవరి 7న రిలీజ్ అని అనౌన్స్ చేశారు. రెండు సినిమాల్లోనూ అలియా యాక్ట్ చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ పాన్ ఇండియా మూవీ, ‘గంగుబాయి’ హిందీ వెర్షన్ వరల్డ్ వైడ్ రిలీజ్ అనుకున్నారు. దీంతో విడుదల తేది వాయిదా పడే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి.

Pooja Hegde : మాల్దీవుల్లో రచ్చ చేస్తుందిగా..

ఎట్టకేలకు ‘గంగూబాయి’ రిలీజ్ డేట్ మార్చారు. 2022 ఫిబ్రవరి 18న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ప్రకటించారు. సహృదయంతో తమ సినిమా విడుదలను వాయిదా వేసుకున్న ‘గంగూబాయి’ టీంకు దర్శకధీరుడు రాజమౌళి సోషల్ మీడియా ద్వారా థ్యాంక్స్ తెలిపారు.