Ramesh Babu : రమేష్‌బాబుకు మృతిపై ఘట్టమనేని కుటుంబం విన్నపం
ఘట్టమనేని రమేష్‌బాబు మృతిపై ఘట్టమనేని కుటుంబం తరపున సోషల్ మీడియాలో ఓ విన్నపాన్ని షేర్ చేశారు. ''ఆయన మరణానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో.........
- Saketh U
- Published on- January 9, 2022 / 07:35 AM IST
Ramesh Babu
Ramesh Babu : సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేశ్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు నిన్న రాత్రి మరణించారు. గతకొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే హాస్పిటల్ కి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. దీంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు.
Ramesh Babu : బిజినెస్మెన్ స్పెషల్ షోలో రమేష్‌బాబుకు నివాళులు అర్పించిన అభిమానులు
అయితే ఘట్టమనేని రమేష్‌బాబు మృతిపై ఘట్టమనేని కుటుంబం తరపున సోషల్ మీడియాలో ఓ విన్నపాన్ని షేర్ చేశారు. ”ఆయన మరణానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మా శ్రేయోభిలాషులందరినీ కోవిడ్ నిబంధనలకు కట్టుబడి, దహన సంస్కారాల స్థలంలో గుమికూడకుండా ఉండాలని మేము అభ్యర్థిస్తున్నాము. ఇట్లు.. ఘట్టమనేని కుటుంబం అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
