Meetha Raghunath : పెళ్లి చేసేసుకున్న ‘గుడ్ నైట్’ హీరోయిన్.. ఫోటోలు వైరల్..
పెళ్లి చేసేసుకున్న ‘గుడ్ నైట్’ హీరోయిన్. వెడ్డింగ్ ఫోటోషూట్ ని షేర్ చేసిన మీతా రఘునాథ్.
- gum 95921
- Published On : March 18, 2024 / 11:24 AM IST
Good Night movie Actress Meetha Raghunath wedding photos gone viral
Meetha Raghunath : చెన్నై భామ మీతా రఘునాథ్.. టీనేజ్ లవ్ స్టోరీ ‘ముదల్ నీ ముడివుం నీ’ అనే తమిళ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ళ మనసుని దోచుకున్నారు. ఆ తరువాత ‘గుడ్ నైట్’ వంటి ఫీల్ గుడ్ మూవీలో పక్కింటి అమ్మాయిలా నేచురల్ యాక్టింగ్ తో అబ్బాయిల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ అవ్వడంతో.. ఇక్కడి అబ్బాయిలు కూడా మీతా పై మనసు పాడేసుకున్నారు.
దీంతో మీతాని మరిన్ని సినిమాల్లో చూడాలని అభిమానులు ఎదురు చూస్తుంటే.. ఆమె మాత్రం పెళ్లి పీటలు ఎక్కి మ్యారేజ్ లైఫ్ ని స్టార్ట్ చేసేసారు. గత ఏడాది నవంబర్ లో ఈమె ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అవి చూసి ఆడియన్స్ అంతా షాక్ అయ్యారు. కెరీర్ లో ఎదుగుతున్న సమయంలో.. మీతా పెళ్ళికి సిద్దమైందేంటి అంటూ ప్రశ్నలు వేస్తూ వచ్చారు.
Also read : Pushpa 2 : పుష్ప 2 మొదటి పాట రాబోతోందా.. ఈసారి ప్రమోషన్స్‌లో తగ్గేదేలే..
అయితే తాజాగా ఈమె ఏడడుగులు కూడా వేసేసారు. మీతా రఘునాథ్ సైలెంట్ గా తన పెళ్లి వేడుకను పూర్తీ చేసేసుకున్నారు. ఈ వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోలను మీతా తన సోషల్ మీడియాలో షేర్ చేసారు. ‘నా నిండు హృదయం’ అంటూ ఫోటోలను షేర్ చేసారు. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజెన్స్.. కొత్త జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే మీతా ఫ్యాన్స్ మాత్రం.. ఆమె ఇక నటించదా అంటూ బాధ వ్యక్తం చేస్తున్నారు.
