Bhimaa : మొన్న హనుమాన్.. ఇప్పుడు భీమా.. రేపు కల్కి.. ఆ పాయింట్‌తో సినిమాలు!

మొన్న హనుమాన్ మూవీ ఇప్పుడు గోపీచంద్ భీమా, రేపు ప్రభాస్ కల్కి.. అదే పాయింట్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి.

Bhimaa : మొన్న హనుమాన్.. ఇప్పుడు భీమా.. రేపు కల్కి.. ఆ పాయింట్‌తో సినిమాలు!

Gopichand Bhimaa Prabhas Kalki Teja Sajja Hanuman movies comes with same point

Bhimaa : మ్యాచో స్టార్ గోపీచంద్, కన్నడ మాస్ డైరెక్టర్ హర్షతో తెరకెక్కిస్తున్న సినిమా ‘భీమా’. ఈ చిత్రంలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడంటూ చెప్పడంతో.. అందరూ ఈ సినిమా మాస్ బొమ్మ అనుకున్నారు. కానీ ఇవాళ రిలీజైన ట్రైలర్ చూస్తుంటే.. సోషియో ఫాంటసీ మూవీ అని తెలుస్తుంది. హిందూ పురాణాల్లోని మహావీరుడు, సప్తచిరంజీవుల్లో ఒకరైన పరుశరాముడి రిఫరెన్స్‌తో మూవీని తెరకెక్కించినట్టు తెలుస్తోంది.

పరుశరాముడి గండ్రగొడ్డలి వేటుతో ఏర్పడ్డ ఒక గ్రామం చుట్టూ ఈ కథ సాగనుంది. అక్కడ కొన్ని చెడ్డ శక్తులు రాజ్యమేలుతుంటే.. వారిని ఎదుర్కోవడానికి హీరో పరుశరాముడిగా పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో వెళ్తాడు. ఈక్రమంలో హీరో కూడా క్షుద్ర శక్తులతో ఫైట్ చేస్తూ తాను ఒక శక్తిగా కనిపిస్తున్నాడు. అంతేకాదు, పరుశరాముడి ఆయుధం అయిన గొడ్డలిని కూడా హీరో చేతులో చూపించారు. మొత్తానికి ట్రైలర్.. మాస్‌ని, ఫాంటసీని మిక్స్ చేసి ఆడియన్స్ లో మంచి ఆసక్తి క్రియేట్ చేశారు.

Also read : Akira Nandan : అకిరా కొత్త ఫోటో షేర్ చేసిన రేణూదేశాయ్.. వింటేజ్ పవన్‌ని గుర్తు చేస్తూ..

కాగా ప్రభాస్ కల్కి సినిమాలో సప్తచిరంజీవుల రిఫరెన్స్ ఉందంటూ టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల హనుమాన్ మూవీలో కూడా సప్తచిరంజీవుల్లో ఒకరైన ‘విభిషణుడు’ని చూపించారు. ఇప్పుడు భీమాలో కూడా సప్తచిరంజీవుల రిఫరెన్స్ కనిపించబోతుందని తెలుస్తుంది. ఆడియన్స్ కి ఆసక్తి రేకిత్తిస్తున్న మరో విషయం ఏంటంటే.. ట్రైలర్‌లో పరుశరాముడి గండ్రగొడ్డలిని ప్రత్యేకంగా చూపించడం.

మరి ట్రైలర్ తో బాగానే ఆకట్టుకున్న భీమా.. థియేటర్స్ లో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. కాగా ఈ సినిమా శివరాత్రి సందర్భంగా మార్చి 8న ఆడియన్స్ ముందుకు రానుంది. శ్రీసత్య సాయి ఆర్ట్స్ నిర్మాణంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియభావాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.