Akira Nandan : అకిరా కొత్త ఫోటో షేర్ చేసిన రేణూదేశాయ్.. వింటేజ్ పవన్‌ని గుర్తు చేస్తూ..
రేణూదేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో అకిరా కొత్త ఫోటోని షేర్ చేశారు. ఆ పిక్ లో అకిరా వింటేజ్ పవన్‌ని గుర్తు చేస్తూ..

Akira Nandan
Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ తన రీసెంట్ లుక్స్ తో ఆడియన్స్ ని ఫిదా చేస్తున్నాడు. ముఖ్యంగా మెగా అభిమానులకు వింటేజ్ పవన్ ని గుర్తు చేస్తూ.. దిల్ కుష్ చేస్తున్నాడు. ఇటీవల సంక్రాంతి సంబరాల్లో అకిరా.. తన హెయిర్ స్టైల్ అండ్ గడ్డంతో వింటేజ్ పవన్ కళ్యాణ్‌లా కనిపించాడు. దీంతో ఆ ఫొటోని, పవన్ వింటేజ్ పిక్‌తో జత చేస్తూ నెట్టింట వైరల్ చేశారు మెగా అభిమానులు.
ఇక తాజాగా రేణూదేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో అకిరా కొత్త ఫోటోని షేర్ చేశారు. ఆ పిక్ లో అకిరా.. పవన్ లాగానే సింపుల్ అవుట్ ఫిట్స్ తో అదే హెయిర్ స్టైల్ అండ్ గడ్డంతో ఇయర్ ఫోన్స్ లో సాంగ్స్ వింటూ రాకింగ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఇది చూసిన పవన్ అభిమానులు.. ఈ ఫొటోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సందడి చేస్తున్నారు.
Also read : Bhimaa Trailer : గోపీచంద్ మాస్ యాక్షన్ మూవీ ‘భీమా’ ట్రైలర్ వచ్చేసింది..
కాగా రేణూదేశాయ్ ఈ ఫొటోని షేర్ చేస్తూ ఒక విషయాన్ని చెప్పుకొచ్చారు. “నేను అకిరా అండ్ ఆద్యకి బ్లూటూత్ కాకుండా ఇయర్ ఫోన్స్ యూజ్ చేయమని చెబుతూ ఉంటాను. ఎందుకంటే బ్లూటూత్ టెక్నాలజీ బ్రెయిన్‌ని డ్యామేజ్ చేస్తుంటుంది. నా మాట విని ఫ్యాన్సీ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ కాకుండా ఇయర్ ఫోన్స్ వాడుతున్న అకిరాని చూస్తే ఆనందంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు.
View this post on Instagram
ఇది ఇలా ఉంటే, పవన్ అభిమానులంతా అకిరా సినిమా ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ అకిరా మాత్రం యాక్టింగ్ వైపు కాకుండా మ్యూజిక్ వైపు ఇంటరెస్ట్ చూపిస్తున్నాడు. అమెరికా ఫిలిం స్కూల్ లో జాయిన్ అయిన అకిరా.. అక్కడ మ్యూజిక్ పాఠాలు, సినీ ప్రొడక్షన్ పై శిక్షణ తీసుకుంటున్నాడు. మరి భవిషత్తులో పవన్ అభిమానులను అకిరా ఎలా పలకరిస్తారో చూడాలి.