Allu Arjun-Vijay Devarakonda : ఐకాన్ స్టార్, రౌడీ బాయ్ మల్టీస్టారర్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో (Allu Arjun-Vijay Devarakonda) మూవీ అంటూ ఎప్పటినుంచో టాక్ వినిపిస్తోంది
- Thota Vamshi Kumar
- Published On : March 7, 2026 / 09:48 AM IST
Gossip Garage Allu Arjun And Vijay Devarakonda Multistarrer Movie
Allu Arjun-Vijay Devarakonda : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో మూవీ అంటూ ఎప్పటినుంచో టాక్ వినిపిస్తోంది. అయితే బన్నీ తన 23వ చిత్రం AA23లో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో కలిసి ప్లాన్ చేస్తున్నాడట. ఈ ఏడాదిలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అల్లుఅర్జున్, లోకేశ్ కనగరాజు కాంబోలో వస్తున్న పిక్చర్‌లో మరో యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కూడా కీలక పాత్రలో నటించే అవకాశం ఉందట. విజయ్, బన్నీతో భారీ మల్టీ స్టారర్‌గా మలిచే ప్లాన్ చేస్తున్నాడట లోకేశ్ కనగరాజ్. అల్లు అర్జున్ యాక్షన్ హీరో ఇమేజ్‌తో విజయ్ దేవరకొండ స్టైలిష్ ఎనర్జీ కలిస్తే బొమ్మ దద్దరిలిపోవాల్సిందే అంటున్నారు.
Allu Sirish Wedding : అల్లు శిరీష్, నయనిక పెళ్లి ఫోటోలు.. ఇక్కడ చూసేయండి
లోకేశ్ కనగరాజ్ తన కూలీ మూవీలో రజినీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్ వంటి పాన్ ఇండియా స్టార్లను ఒకేసారి కలిపి మల్టీ స్టారర్‌ను సృష్టించి సంచలనం సృష్టించాడు. అదే లైన్‌లో ఇప్పుడు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండతో మరో మల్టీస్టారర్ పిక్చర్‌ను తెరకెక్కించి ఆడియన్స్‌కు మించి కిక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు టాక్.
రౌడీ బాయ్, ఐకాన్ స్టార్ కాంబినేషన్‌లో యాక్షన్, ఎమోషన్, మాస్ అప్పీల్‌తో కూడిన బ్లాక్‌బస్టర్‌గా మారే ఛాన్స్ ఉందంటున్నారు. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మార్కెట్ వరకు అభిమానులు ఈ కాంబినేషన్‌లో రాబోయే మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
