Chiranjeevi- Srikanth Odela : చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల సినిమాకు బ్రేక్.. అసలు నిజం ఇదే!
నాని నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల సినిమాను కూడా గ్రాండ్‌గా అనౌన్స్ చేశారు.
- Thota Vamshi Kumar
- Published on- October 9, 2026 / 08:45 AM IST
gossip garage Break for Chiranjeevi and Srikanth Odela movie
Chiranjeevi- Srikanth Odela : దసరా మూవీ హిట్ కావడంతో హీరో, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోకు తిరుగులేదన్నారు. అదే ఊపులో ది పారడైజ్ పట్టాలెక్కింది. మరోవైపు నాని నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల సినిమాను కూడా గ్రాండ్‌గా అనౌన్స్ చేశారు. కానీ ది ప్యారడైజ్ ఫలితం తేడా కొట్టగానే సీన్ రివర్స్ అయిపోయిందట.
ఇప్పుడు చిరు, ఓదెల సినిమా ఆగిపోయిందని, అందుకు ప్యారడైజ్ రిజల్టే కారణమని లీక్స్ వస్తుండటం ఆసక్తికరంగా మారింది. నిన్నటి వరకు ఓదెల టాలెంట్‌ను ఆకాశానికెత్తిన వాళ్లే.. ఒక్క ఫ్లాప్‌తో చిరంజీవి ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కూడా ఆయన్నే కారణంగా చూపిస్తుండటంనూ టాలీవుడ్‌లో హాట్ డిస్కషన్ నడుస్తోంది.
Sri Satya : వియత్నాంలో బిగ్‌బాస్ బ్యూటీ.. శ్రీ సత్య ఫోటోలు..
సినిమా హిట్ అయితే హీరో, నిర్మాత, టీమ్ మొత్తం క్రెడిట్ తీసుకుంటారు. ఫ్లాప్ అయితే దర్శకుడు ఒక్కడే బలి కావాలా.? అన్న ప్రశ్న ఇప్పుడు గట్టిగానే వినిపిస్తోంది. దిప్యారడైజ్ రిజల్ట్‌ను అడ్డం పెట్టుకొని శ్రీకాంత్ ఓదెలను కార్నర్ చేస్తూ, చిరంజీవి సినిమాకు బ్రేక్ అంటూ లీక్స్ రావడం వెనుక అసలు కథేంటి? నిజంగానే చిరు, ఓదెల ప్రాజెక్ట్‌కు బ్రేక్ పడిందా.? లేక శ్రీకాంత్ ఓదెలపై ఒత్తిడి పెంచేలా ఈ ప్రచారం నడుస్తోందా.? ఏదేమైనా ఒక్క ఫ్లాప్‌తో దర్శకుడి చుట్టూనే నెగెటివ్ నేరేటివ్ నడవడం మాత్రం ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త చర్చకు తెరలేపుతోంది.
