Dil Raju : జటాయువు పై దిల్ రాజు మూవీ?

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు జటాయువు కథతో ఓ భారీ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది

Gossip Garage Dil Raju planning jatayu movie

Dil Raju : రామాయణ సినిమాలో జటాయువు ఎపిసోడ్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. జటాయువు పాత్రను తెరపై చూపించిన తీరు, ఆ ఎపిసోడ్‌లోని భావోద్వేగాలు, విజువల్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. అయితే గతంలోనే జటాయువు పాత్ర ఆధారంగా ఓ ప్రత్యేక సినిమా తెరకెక్కబోతుందనే వార్తలు టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున వినిపించాయి. అయితే కొంతకాలంగా ఈ ప్రాజెక్టుపై ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఆ చర్చలు ఆగిపోయాయి. లేటెస్ట్‌గా మరోసారి జటాయువు సినిమా చుట్టూ టాలీవుడ్‌లో కొత్త చర్చ ఊపందుకుంది.

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు జటాయువు కథతో ఓ భారీ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కథ, కథనాలపై ప్రత్యేక దృష్టి పెట్టి స్క్రిప్ట్ వర్క్ కూడా చేయిస్తున్నారనే ప్రచారం వినిపిస్తోంది. రామాయణంలో జటాయువు పాత్రకు ఉన్న ప్రాధాన్యత, శ్రీరాముడి కోసం ఆ పక్షి చేసిన త్యాగం, రావణుడితో చేసిన పోరాటం వంటి అంశాల ఆధారంగా అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌తో సినిమాను రూపొందించే ఆలోచనలో ఉన్నారట.

రామాయణంలోని జటాయువు పాత్ర ఆధారంగా భారీ మైథలాజికల్ ఫాంటసీ సినిమాను గతంలోనే దిల్‌ రాజు ప్లాన్ చేశారని అంటున్నారు. ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెండేళ్ల పాటు ప్రీ-ప్రొడక్షన్, VFXపై కసరత్తు కూడా నడిచిందట. అత్యున్నత గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ హంగులతో పాన్ ఇండియా రేంజ్‌ పిక్చర్‌గా..రామాయణం ఘట్టాన్ని ఒక భిన్నమైన కోణంలో, జటాయువు త్యాగం బ్యాక్‌డ్రాప్‌లో చూపించాలని భావించారట.

అయితే భారీ బడ్జెట్ దృష్ట్యా కాస్త వెనకడుగు వేసినా..ఇప్పుడు రామాయణం సక్సెస్ టాక్‌తో..దిల్‌రాజు ప్లాన్ చేసిన జటాయువు పిక్చర్‌ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. నిజంగానే దిల్‌రాజు జటాయువు పాత్ర ఆధారంగా మూవీ తీయబోతున్నారా.? జస్ట్ రూమరా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.