Prabhas : డార్లింగ్, దిల్ రాజు కాంబో ఫిక్స్.?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), నిర్మాత దిల్‌రాజుకు సంబంధించిన ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.
- Thota Vamshi Kumar
- Published on- August 28, 2026 / 09:55 AM IST
Gossip Garage Dill Raju Locked A Crazy Script For Prabhas
Prabhas : మార్కో సినిమాతో మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న దర్శకుడు హనీఫ్ అదేనీపై ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. హనీఫ్ అదేనీని ఇప్పటికే ఓ భారీ ప్రాజెక్ట్ కోసం దిల్‌రాజు లాక్ చేసినట్టు ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను హీరోగా పెట్టి తీయాలని ప్లాన్ చేస్తున్నారట. హనీఫ్ అదేనీ స్టైల్‌లో ఉండే రా అండ్ రస్టిక్ యాక్షన్‌కు ప్రభాస్ భారీ స్క్రీన్ ప్రెజెన్స్ జతైతే, మాస్ ఆడియన్స్‌కు పూనకాలే అంటూ అప్పుడు హైప్ క్రియేట్ అవుతోంది.
ప్రస్తుతం ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, దిల్‌రాజు ఈ కాంబినేషన్‌ను సెట్ చేయడంపై ఆసక్తి చూపుతున్నారట. ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, ఆయన ఫ్యాన్స్ కోరుకునే పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్..హనీఫ్ అదేనీ డైరెక్షన్‌లో తెరకెక్కితే..ఆ ప్రాజెక్ట్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అంటున్నారు. మార్కోతో తన యాక్షన్ టేకింగ్ ఎలా ఉంటుందో చూపించిన హనీఫ్..ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌ను ఎలా ప్రెజెంట్ చేస్తాడనే ఆసక్తి కూడా నెలకొంది.
Taapsee Pannu : గాంధారి వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన తాప్సీ
ప్రభాస్‌తో హనీఫ్ అదేని సినిమా..ఈ కాంబో సెట్ అయితే మాత్రం తెలుగు మార్కెటే కాదు..పాన్ ఇండియా స్థాయిలో భారీ బజ్ రావడం ఖాయం. దిల్ రాజు నిర్మాణంలో ప్రభాస్ హీరోగా, హనీఫ్ అదేని దర్శకత్వంలో సినిమా అంటే భారీ బడ్జెట్, స్టైలిష్ యాక్షన్, పవర్‌ఫుల్ ఎమోషన్స్‌తో కూడిన ప్రాజెక్ట్‌గా వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం కేవలం టాక్‌గా వినిపిస్తున్న ఈ కాంబినేషన్ నిజంగా తెరపైకి వస్తుందా.? ప్రభాస్ కోసం హనీఫ్ అదేని ప్రత్యేకమైన కథ సిద్ధం చేస్తున్నారా.? అనేది క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
