Tollywood stars : ఓవర్ టు ముంబై అంటున్న టాలీవుడ్ స్టార్స్
ప్రభాస్, అల్లుఅర్జున్, మహేష్ బాబు, సమంత, రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ, సూర్య వంటి స్టార్‌లు (Tollywood stars) ఇప్పటికే ముంబైలో ఖరీదైన ప్లాట్లు, లగ్జరీ అపార్ట్‌మెంట్లు, విల్లాలు కొనుగోలు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- June 24, 2026 / 09:15 AM IST
Gossip Garage Few Tollywood stars wants to settle in Mumbai
Tollywood stars : ప్రభాస్, అల్లుఅర్జున్, మహేష్ బాబు, సమంత, రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ, సూర్య వంటి స్టార్‌లు ఇప్పటికే ముంబైలో ఖరీదైన ప్లాట్లు, లగ్జరీ అపార్ట్‌మెంట్లు, విల్లాలు కొనుగోలు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు అక్కడే ఎక్కువ సమయం గడుపుతూ సెటిల్ కావాలని చూస్తుండగా, మరికొందరు షూటింగ్‌లు లేనప్పుడు కూడా ముంబైలోనే ఉంటున్నారని టాక్.
పాన్ ఇండియా సినిమాలు పెరగడం, బాలీవుడ్ మార్కెట్‌పై దృష్టి పెట్టడం, ఓటీటీ ప్రాజెక్టుల కేంద్రంగా ముంబై ఉండటమే..టాలీవుడ్ స్టార్లు ముంబైకి షిఫ్ట్ అవడానికి మెయిన్ రీజన్‌గా చెబుతున్నారు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, ఫ్యాషన్ ఈవెంట్లు, ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ ముంబైలో ఈజీగా లభించడం కూడా మరో కారణమంటున్నారు.
Srinivasa Mangapuram : శ్రీనివాస మంగాపురం మూవీ సాంగ్ వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన రాషా థడాని
అయితే టాలీవుడ్ స్టార్స్ ముంబైకి షిఫ్ట్ అవడంతో..నిర్మాతలపై ఆర్థిక భారం పడుతుందన్న చర్చ జరుగుతోంది. స్టార్‌లు ముంబైలో ఉండటం..షూటింగ్ కోసం వారిని హైదరాబాద్‌కు తీసుకురావడం, మళ్లీ పంపించడం, ఖర్చులు పెరుగుతున్నాయట. ఫ్లైట్ టికెట్, అకామిడేషన్, సెక్యూరిటీ, ట్రావెల్ మేనేజ్‌మెంట్ కలిపి బానే ఖర్చు అవుతోందట.
స్టార్స్‌కు ముంబైలో ఇతర ప్రాజెక్టులు, ప్రకటనలు, ఈవెంట్లు ఉండటం వల్ల డేట్స్ కోఆర్డినేట్ చేయడం కూడా కష్టమవుతోందట. దీంతో టాలీవుడ్ స్టార్స్ ఓవర్ టు ముంబై అనడంపై..నిర్మాతలు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముంబై ఇప్పుడు కేవలం బాలీవుడ్‌కే కాదు..టాలీవుడ్‌కు కూడా కేరాఫ్‌గా మారుబోతోందా అన్న చర్చ నడుస్తోంది.
