×
Ad

Pawan Kalyan : పవన్‎కు జోడీగా ఫౌజీ బ్యూటీ..!

సురేందర్‌ దర్శకత్వంలో పవన్‌ (Pawan Kalyan) చేయబోయే మూవీపై అప్పుడే ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ అవుతోంది.

Gossip Garage Imanvi Ismail lead role in pawan and surender redddy movie

Pawan Kalyan : సురేందర్‌ దర్శకత్వంలో పవన్‌ చేయబోయే మూవీపై అప్పుడే ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ అవుతోంది. తన మార్క్ టేకింగ్.. హిట్ కంటెంట్‌తో రావాల‌ని మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్స్ అయ్యాడు సురేందర్‌రెడ్డి. రాక‌రాక ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సినిమా తీసేందుకు వ‌చ్చిన అవ‌కాశంతో గ్రాండ్‌గా కమ్‌ బ్యాక్ ఇవ్వాల‌ని చూస్తున్నాడు. ఇప్పటికే ప్రాజెక్ట్ అపిషీయల్‌గా ప్రకటించగా కాస్ట్ అంట్ క్రూ కోసం బానే సెర్చ్ చేస్తున్నారట. అయితే ప‌వ‌న్ సరసన హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారనే చర్చ ఎప్పటినుంచో జరుగుతోంది. ఫౌజీ బ్యూటీ ఇమ్మాన్వి ఇస్మైల్‌ని తీసుకుంటే బాగుంటుంద‌ని భావిస్తున్నారట.

ఫౌజీ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు జంటగా నటిస్తున్న ఇమ్మాన్వి ఇస్మైల్‌ను ఆల్‌మోస్ట్‌ హీరోయిన్‌గా లాక్ చేశారని టాక్ నడుస్తుంది. పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఇక ఇమ్మాన్వి ఇస్మైల్‌కు మంచి క్రేజ్ ఉంది. ఆమె బెస్ట్ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ నుంచి ఇప్పుడు ఫౌజీ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది.

Nivita : అప్పట్లో పవన్ కళ్యాణ్ తో స్టేజి మీద వైరల్ అయిన నటి.. ఇప్పుడు జనసేనలోకి..

ఈ సినిమా రిలీజ్ కాకముందే పవన్‌తో జోడి కట్టే అవకాశం ఉందట. ఇది నిజమా లేక జస్ట్ రూమర్స్ అనేది తెలియాలంటే డైరెక్టర్ సురేందర్ రెడ్డి టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో పవన్ చేయబోయే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి స్టార్ట్ కాబోతోందట. ఇది కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

ఇక టైటిల్ కూడా రెండు అక్షరాలు మాత్రమే ఉంటుందనే టాక్ నడుస్తుంది. పవన్ ఓజీకి రెండు అక్షరాలే. ఈ సారి కూడ ఇదే సెంటిమెంట్‌తో పాటు మాస్ రేంజ్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా మూవీ టైటిల్‌ను ఫిక్స్ చేస్తున్నారట. మార్చిలో సెట్స్ మీదకు వెళ్ళి..ఈ ఇయర్ ఎండింగ్‌లో రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.