Peddi Piracy: పెద్ది మూవీకి ఐబొమ్మ టెన్షన్..!?

పెద్ది మూవీకి ఐబొమ్మ టెన్షన్ అంటూ (Peddi)టాలీవుడ్‌లో హాట్ టాపిక్ నడుస్తుంది. గ

is IBOMMA TENSION to peddi movie

Peddi – Ibomma: పెద్ది మూవీకి ఐబొమ్మ టెన్షన్ అంటూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ నడుస్తుంది. గతేడాది నవంబర్‌లో ఐబొమ్మ కింగ్‌పిన్ ఇమ్మడి రవి అరెస్ట్ అయిన తర్వాత సైట్ పూర్తిగా క్లోజ్ అయింది. ఆ సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. చిన్న సినిమాలు కూడా థియేటర్లలో మంచి వసూళ్లు సాధించాయి. పైరసీ తగ్గటంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఐబొమ్మ కొత్త డొమైన్స్‌తో మళ్లీ రిటర్న్ అయింది. బప్పం టీవీ, మిర్రర్ లింక్స్ అంటూ కొత్త రూపంలో రీఎంట్రీ ఇవ్వడం..ఈ వారంలో రిలీజ్ అయిన చిన్న సినిమాలు కూడా వెంటనే అందులో అప్‌లోడ్ కావడంతో ఇండస్ట్రీ మరోసారి షాక్ అయింది. త్వరలో రిలీజ్ కాబోతున్న మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ పెద్ది మూవీ మేకర్స్‌కు ఐ బొమ్మ టెన్షన్ పట్టుకుందన్న డిస్కషన్ జరుగుతోంది.

పెద్ది జూన్ 4న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ అవుతుంది. జూన్ 3 సాయంత్రం నుంచే పెయిడ్ ప్రీమియర్స్ ప్రారంభమవుతాయి. దాదాపు 300-350 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 1980నాటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోంది. ట్రైలర్ వచ్చిన తర్వాత మూవీపై హైప్ భారీగా పెరిగింది. పాన్ ఇండియా లెవల్‌లో థియేట్రికల్ వసూళ్లు భారీగా ఆశిస్తున్న ఈ మూవీ పైరసీ అయితే ఊహించనంత నష్టం ఉంటుందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

*Janhvi Kapoor : పెద్ది భామ పాష్ పోజులు.. జాన్వీ కపూర్ ఫొటోలు..

ఐబొమ్మ, బప్పం టీవీ లాంటి సైట్లను బ్లాక్ చేయాలంటూ పెద్ది టీమ్ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు కంప్లైంట్‌ ఇచ్చినట్టు టాక్. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి యాక్షన్ ప్లాన్ చేస్తున్నా, సైట్ ఆపరేటర్లు కొత్త డొమైన్స్, మిర్రర్ లింక్స్‌తో తప్పించుకుంటున్నారట. ఐబొమ్మ రవి అరెస్ట్ అయి బెయిల్‌పై రిలీజ్‌ అయిన తర్వాత సైట్ రీటర్న్ అవడం ఇండస్ట్రీని మరింత టెన్షన్ పెడుతోంది. పెద్ది టీమ్ ఇప్పుడు నెక్స్ట్ లెవల్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమా పైరసీ అయితే మాత్రం మొత్తం తెలుగు ఇండస్ట్రీ ఫ్యూచర్‌పై ప్రభావం పడొచ్చన్న టాక్ నడుస్తోంది.

ఇంత పెద్ద బడ్జెట్, పాన్ ఇండియా స్కోప్ ఉన్న మూవీని పైరసీ చేస్తే ఇతర బిగ్ బడ్జెట్ ప్రాజెక్టులు కూడా రిస్క్ తీసుకునేందుకు వెనకాడొచ్చు. టాలీవుడ్ ఊపిరి పీల్చుకున్న టైమ్‌లో మళ్లీ పైరసీ రివైవల్ ఇండస్ట్రీని టెన్షన్‌లో పెట్టేసింది. పోలీసులు, ఫిల్మ్‌ ఛాంబర్‌ కలిసి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటేనే పెద్ది లాంటి భారీ ప్రాజెక్ట్ సేఫ్ అవుతుందని ఇండస్ట్రీ టాక్.