Dragon : రెండు పార్టులుగా డ్రాగ‌న్ మూవీ?

ఎన్టీఆర్, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో వస్తున్న డ్రాగన్‌ మూవీ (Dragon) గ్లింప్స్‌ మూవీపై హైప్‌ను పెంచేసింది.

Gossip Garage is ntr Dragon movie release in two parts

Dragon : ఎన్టీఆర్, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో వస్తున్న డ్రాగన్‌ మూవీ గ్లింప్స్‌ మూవీపై హైప్‌ను పెంచేసింది. అయితే డ్రాగన్‌ పార్ట్‌-1 రిలీజ్‌కు ఇంకా వన్ ఇయర్ టైమ్ ఉంది. కానీ.. అప్పుడే డ్రాగన్‌ పార్ట్‌-2పై ఇండస్ట్రీలో బలమైన టాక్ వినిపిస్తోంది. ఈ స్టోరీ బిగ్ స్కేల్‌లో ఉండటంతో రెండు పార్టులుగా రిలీజ్ చేస్తారని అంటున్నారు. గ్లింప్స్ రిలీజ్ అయినా.. పార్ట్-2పై అనౌన్స్ చేయకపోయినా డ్రాగన్‌-2పై గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. పార్ట్-2 షూటింగ్ కూడా ప్యార్‌లల్‌గా పూర్తి చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

డ్రాగన్‌ పార్ట్-1 జూన్ 11, 2027న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. డ్రాగన్‌ పార్ట్‌-2ను కూడా ఆరు నెలల గ్యాప్‌లోనే అంటే డిసెంబర్ 2027లో విడుదల చేసేలా మూవీ మేకింగ్ నడుస్తోందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్‌ను నెక్స్ట్ లెవల్‌ యూనివర్స్‌గా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. సలార్ స్ట్రాటజీ లాగా రెండు పార్టులను ఒకేసారి షూట్ చేసి క్లోజ్ గ్యాప్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు డిస్కషన్స్ నడుస్తున్నాయి.

Sravanthi Chokarapu : బ్లాక్ డ్రెస్‌లో యాంక‌ర్ స్ర‌వంతి.. క్యూట్ ఫోటోలు..

అఫ్గానిస్థాన్ 1967 సెట్టింగ్ నుంచి గోల్డెన్ ట్రయాంగిల్ వరకు నడిచే స్టోరీలో ఎమోషన్, యాక్షన్ ఎక్కువగా ఉండటంతో సింగిల్‌ పార్టుగా తీసుకురాలేకపోతున్నారట. ఎన్టీఆర్ లీన్ లుక్‌తో పార్ట్-1 కోసం ట్రాన్స్‌ఫార్మ్ అయి, పార్ట్ 2 కోసం మళ్లీ బల్క్‌ అవుతున్నట్లు చెబుతున్నారు. నీల్ స్టైల్‌లో ఇది పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. గ్లింప్స్ రిలీజ్ తర్వాత డ్రాగన్‌-2పై ఊహాగానాలు ఎక్కువైపోయాయి.