Raaka : రాకాలో బాలీవుడ్ బాద్‌షా?
అల్లుఅర్జున్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయిన రాకా (Raaka ) టైటిల్ పోస్టర్ .సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
- Thota Vamshi Kumar
- Published On : April 10, 2026 / 02:54 PM IST
Gossip Garage Is Shah Rukh Khan doing special role in Allu Arjun Raaka movie
Raaka : అల్లుఅర్జున్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయిన రాకా టైటిల్ పోస్టర్..సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. రాక్షసుడి వేషధారణలో అల్లుఅర్జున్ లుక్ మూవీపై అంచనాలను పెంచేస్తుంది. డైరెక్టర్ అట్లీ, అల్లుఅర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై నార్త్ టు సౌత్ ఓ రేంజ్‌లో బజ్ క్రియేట్ అయింది.
ఈ క్రమంలోనే రాకా మూవీపై ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఐకాన్‌స్టార్ హీరోగా అట్టీ దర్శకత్వంతో వస్తున్న సినిమాలో స్పెషల్ క్యామియో రోల్ కోసం బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను సంప్రదించారని టాక్. పాన్-ఇండియా లెవల్‌లో మరింత బలమైన కనెక్షన్ తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ ఇప్పటికే అనేక దక్షిణ భారత సినిమాల్లో క్యామియోలు చేశారు కాబట్టి, ఈ ఆఫర్‌ను సీరియస్‌గా పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. ఒకవేళ షారుఖ్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే మాత్రం..రాకా జోరును ఎవరూ ఆపలేరన్న చర్చ జరుగుతోంది.
Pooja Hegde : సినిమాలకు పూజా హెగ్డే గుడ్‌బై.?
లేటెస్ట్‌గా రిలీజ్ అయిన రాకా పోస్టర్‌పై షారుఖ్ ఖాన్ రియాక్ట్ అవడంతో ఈ గాసిప్స్‌కు ఇంకా బలం చేకూరుస్తోంది. ఎంతో ఆసక్తికరంగా, అద్భుతంగా ఉందని ప్రశంసించిన బాలీవుడ్ బాద్‌షా..రాకా సినిమా కోసం ఈగర్లీగా వెయిట్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు.
మాస్ మాస్..మాసేస్ అంటూ..రాకా చాలా ఎక్సైటెడ్‌గా ఉందంటూ షారుఖ్ ఖాన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే గతంలో అట్లీ డైరెక్షన్‌లో షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ చేసి గ్రాండ్ సక్సెస్ కొట్టాడు. దీంతో ఇప్పుడు రాకాలో స్పెషల్ క్యామియోపై ఊహాగానాలు ఇంకా ఎక్కువైపోయాయి. ఈ మూవీలో షారుఖ్ స్పెషల్ రోల్ ఉంటుందో లేదో వేచి చూడాలి మరి.
