Varanasi : వారణాసి నుంచి త్వరలోనే అదిరిపోయే అప్‌డేట్..!

మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ మూవీ వారణాసిపై (Varanasi) అంచనాలు భారీగా ఉన్నాయి.

Mahesh babu Varanasi massive update comming soon

Varanasi : మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ మూవీ వారణాసిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత వారణాసి నుంచి రాజమౌళి టీమ్ పెద్దగా కొత్త అప్డేట్స్ ఇవ్వకపోవడం మహేష్ అభిమానుల్లో కొంత అసంతృప్తిని కలిగిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా అయినా సినిమా నుంచి ఏదైనా కొత్త కంటెంట్ వస్తుందని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. లేటెస్ట్‌గా టాక్ ప్రకారం, తన అభిమానుల కోసం మహేష్ బాబు స్వయంగా రాజమౌళిని ఒక మంచి అప్డేట్ ఇవ్వాలని కోరినట్టు టాక్‌.

Aishwarya Rajesh : మోడ్ర‌న్ డ్రెస్‌లో.. స్ట‌న్నింగ్ లుక్‌లో ఐశ్వ‌ర్య రాజేష్‌.. ఫోటోలు వైర‌ల్..

వారణాసి నుంచి ఏదైనా కొత్త కంటెంట్ విడుదల చేస్తే అభిమానులు ఎంతో సంతోషిస్తారని, త్వరగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేలా చూడాలని మహేష్ జక్కన్న‌ను రిక్వెస్ట్ చేశారట. మహేష్ కోరిక ప్రకారం రాజమౌళి వారణాసి నుంచి త్వరలోనే అదిరిపోయే అప్డేట్ ఇస్తారా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

గ్లోబల్ ఆడియెన్స్‌లోనూ ఎక్స్‌పెక్టేషన్స్..ఎగ్జైట్‌మెంట్‌ను పెంచేస్తున్న వారణాసి మూవీ షూటింగ్‌ స్పీడ్‌గా కొనసాగుతోంది. ఈ సినిమాపై..ఎప్పటికప్పుడు కొత్త కొత్త లీకులు, గాసిప్‌లు చక్కర్లు కొడుతున్నాయ్. యాక్షన్ అడ్వెంచర్..సోషియో-ఫాంటసీగా..రామాయణం ఎపిసోడ్ ఇన్‌స్పైర్డ్ స్టోరీగా వారణాసి రూపుదిద్దుకుంటోంది. రూ.1300 కోట్ల బడ్జెట్‌తో ఇంటర్నేషనల్ లెవల్‌లో పిక్చర్‌ తీస్తున్నారని అంటున్నారు. రాజమౌళి, మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా కావడం, చాలాకాలం తర్వాత ప్రియాంక చోప్రా ఈ చిత్రంతో భారతీయ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండటంతో వారణాసిపై ఓ రేంజ్‌ హైప్ కొనసాగుతోంది.