Allu Arjun : ఎన్టీఆర్ క్లారిటీ.. బన్నీ సైలెన్స్ ఎందుకు..?

నాలుగైదు రోజుల కింద అల్లుఅర్జున్‌ (Allu Arjun ) పొలిటికల్ ఎంట్రీ అంటూ ప్రచారం జరిగింది.

Gossip Garage NTR clarifies on Political Entry and why Allu Arjun silent

Allu Arjun : సినీ స్టార్స్ పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు కొత్తేం కాదు. కానీ మధ్య జరుగుతున్న ప్రచారం మాత్రం అంతకు మించి అన్నట్లుగా నడుస్తోంది. నాలుగైదు రోజుల కింద అల్లుఅర్జున్‌ పొలిటికల్ ఎంట్రీ అంటూ ప్రచారం జరిగింది. పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్‌ కిశోర్‌తో భేటీ అయ్యాడని, అల్లుఅర్జున్ మామ తెరవెనుక వ్యవహారాలు చక్కబెడుతున్నారని గాసిప్స్ చక్కర్లు కొట్టాయి.

రెండ్రోజుల గ్యాప్‌లో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీని కూడా కన్ఫామ్ చేసింది సోషల్ మీడియా. ఈ నెల 18న ప్రెస్‌మీట్‌ త్వరలో పొలిటికల్ ఎంట్రీ.. అంటూ పోస్టులు వైరల్ అయ్యాయి. జూ.ఎన్టీఆర్ వెంటనే స్పందించి క్లారిటీ ఇవ్వడంతో ఆయన అభిమానులు కూల్ అయ్యారు. కానీ బన్నీ మాత్రం ఇప్పటివరకు రియాక్ట్‌ కాకపోవడంతో, ఇంత సైలెన్స్ ఎందుకు.? అనే ప్రశ్న మరింతగా వైరల్ అవుతోంది.

Satya Sri : చీర‌క‌ట్టులో ముద్దుగా జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ.. స‌త్య‌శ్రీ ఫోటోలు వైర‌ల్‌

ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తల విషయంలో..బన్నీ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని అంటున్నారు. సరైన టైమ్ చూసి ఒక స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ ఇవ్వాలనే ప్లాన్‌లో అల్లుఅర్జున్ ఉన్నట్లు చెబుతున్నారు. మరికొందరు మాత్రం రూమర్స్‌కి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదనే స్ట్రాటజీతో ఉన్నాడని అంటున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ క్లారిటీ ఇవ్వడంతో అల్లుఅర్జున్ ఫ్యాన్స్ కూడా ఆయన రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే పుష్పరాజ్‌ సైలెన్స్ వెనుక అసలు ప్లాన్ ఏంటో..త్వరలోనే బయటపడుతుందా.? లేదా.? అనేది ఆసక్తికరంగా మారింది.