NTR-Nelson : ఎన్టీఆర్, నెల్సన్.. మాస్..మ్యాడ్ కాంబో..!
NTR-Nelson : టాలీవుడ్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, కోలీవుడ్ స్టైలిష్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో సినిమా రాబోతుందనే చర్చ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.
- Thota Vamshi Kumar
- Published on- October 19, 2026 / 04:40 PM IST
Gossip Garage NTR Director Nelson Combo update
NTR-Nelson : టాలీవుడ్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, కోలీవుడ్ స్టైలిష్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో సినిమా రాబోతుందనే చర్చ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. నిర్మాత నాగవంశీ నెల్సన్ ప్రాజెక్ట్‌పై కన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఈ కాంబినేషన్‌పై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
అసలు ఎన్టీఆర్‌ను నెల్సన్ ఎలా చూపించబోతున్నాడు.? కథలో ఎలాంటి మాస్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి.? ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్టుగా పవర్ఫుల్ యాక్షన్‌తో పాటు నెల్సన్ మార్క్ డార్క్ హ్యూమర్, స్టైలిష్ టేకింగ్‌ను జోడిస్తారా.? అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోతోంది. ఎన్టీఆర్ ఎనర్జీ, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌కు నెల్సన్ డిఫరెంట్ మేకింగ్ స్టైల్ తోడైతే థియేటర్లలో సరికొత్త మాస్ ట్రీట్ చూడొచ్చని ఎక్స్పెక్ట్స్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్.
ప్రస్తుతం ఎన్టీఆర్ తన డ్రాగన్ సినిమా పనులతో బిజీగా ఉండగా, నెల్సన్ తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడట. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌తో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది.? కథ ఏ జానర్లో ఉండబోతోంది.? పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుందా, లేక ఊహించని మలుపులతో డార్క్ కామెడీ యాక్షన్ డ్రామాగా రూపొందుతుందా.? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
కథ, సినిమా లాంచింగ్ డేట్, క్యాస్ట్ అండ్ క్రూపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ కాంబినేషన్ ట్రాక్ ఎక్కితే మాత్రం తెలుగు, తమిళ్ ఆడియన్స్‌కు మరో మాస్ అండ్ డార్క్ కామెడీతో ఫుల్ ఎంటర్‌టైయిన్‌మెంట్ పక్కా అన్న అంచనాలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు, నెల్సన్ స్టైల్ మేకింగ్‌తో..బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో చూడాలి మరి.
