NTR Trivikram : గాడ్ ఆఫ్ వార్ అప్పుడే వివాదం మొదలైందా?

NTR Trivikram: త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ హీరోగా గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా తెర‌కెక్క‌నుంది.

Gossip Garage NTR Trivikram Movie Controversy

NTR Trivikram : గాడ్ ఆఫ్ వార్.. ఈ మూవీ కాంబినేషన్ సెట్‌ కావడానికే చాలా టైమ్‌ పట్టింది. సినిమా స్టోరీ రెడీగా ఉన్నా..హీరోగా ఎన్టీఆర్‌ డేట్స్ ఫిక్స్ అయ్యే వరకు త్రివిక్రమ్‌కు వెయిటింగ్ తప్పలేదు. ఫైనల్‌గా మాటల మంత్రికుడు, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూఎన్టీఆర్ కాంబో సెట్‌ అయిపోయింది. మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది.

కానీ అంతలోనే సోషల్ మీడియాలో తమిళ్ నెటిజన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమా సుబ్రహ్మణ్యస్వామి కథకు దగ్గరగా ఉండొచ్చనే గాసిప్ రావడంతో, తమిళ్ ఆడియన్స్ వెంటనే రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. మురుగన్‌ను తమిళులు అమితంగా ఆరాధిస్తారు. ఇలవేల్పుగా కొలిచే దేవుడి స్టోరీని ఎలా చూపిస్తారనే దానిపై తమిళుల నుంచి డిస్కషన్ మొదలైంది. నార్త్‌లో పుట్టి సౌత్‌లో పూజలు అందుకున్న దేవుడు అనే పోస్టర్‌లో ఉన్న లైన్ కూడా తమిళ ప్రజలను మరింత ట్రిగర్ చేస్తుందన్న టాక్ నడుస్తోంది.

Also Read: జూన్ నెల జ్ఞాప‌కాల‌ను షేర్ చేసిన చిన్న కోడ‌లు..

మరో వైపు ఈ సినిమాలో తమిళ కల్చర్‌ని పక్కన పెట్టి, కథను మార్చేస్తారేమో అనే డౌట్ కూడా వాళ్లలో ఉందట. కొంతమంది అయితే తమ దేవుడిని కమర్షియల్‌గా చూపిస్తారా.? అని సోషల్ మీడియాలో ఓపెన్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ఈ కాంట్రవర్సీతో మూవీ టీమ్ కొంచెం సైలెంట్ అయ్యిందా? లేక స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నారా? అన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: మారిషస్‌లో మెహ్రీన్‌.. ఫోటోలు చూశారా?

అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేకపోయినా, తమిళుల రియాక్షన్‌తో ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ హైప్‌తో పాటు అప్పుడే ట్రెండింగ్‌లోకి వస్తుందన్న చర్చ జరుగుతోంది. పోస్టర్ రిలీజ్‌తోనే ఇంత డిస్కసన్ స్టార్‌ కావడంతో..ఈ స్టోరీని త్రివిక్రమ్ ఎలా డీల్ చేస్తారోనన్న ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది.