Mahesh Babu : బుచ్చి బాబుకు షాక్ ఇచ్చిన మహేశ్ బాబు?

దర్శకుడు బుచ్చిబాబు సానా, సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తుందనే టాక్ గతంలో బలంగా వినిపించింది

Gossip Garage Peddi Effect on Mahesh babu

Mahesh Babu : టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన టాక్ చక్కర్లు కొడుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తుందనే టాక్ గతంలో బలంగా వినిపించింది. పెద్ది సినిమా కంటే ముందే బుచ్చిబాబు.. మహేష్‌కు ఓ స్టోరీ లైన్ చెప్పాడని, దానిపై కొంత వరకు డెవలప్‌మెంట్ కూడా జరిగిందని ఇండస్ట్రీ వర్గాల మాట.

మహేష్‌ వారణాసి పూర్తి అయిన తర్వాత బుచ్చిబాబు సినిమా చేస్తారని కూడా ఊహాగానాలు వినిపించాయి. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం మహేష్ బాబు ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. పెద్ది సినిమాకు వచ్చిన మిక్స్‌డ్‌ టాకే ఇందుకు కారణమని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

Maa Inti Bangaram twitter review : మా ఇంటి బంగారం ట్విట్ట‌ర్ రివ్యూ.. స‌మంత వ‌న్ ఉమెన్‌ షో..

ఇక మహేష్ బాబు ఇప్పుడు తన ప్రాజెక్ట్ కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ వైపు చూస్తున్నాడనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న వారణాసి ప్రాజెక్ట్‌లో తన పార్ట్ షూటింగ్‌ను ఆగస్టులోపు పూర్తిచేసే ప్లాన్‌లో ఉన్నారట మహేష్. ఆ తర్వాత షార్ట్ బ్రేక్‌ తీసుకుని.. ప్రశాంత్ నీల్ చెప్పే కథ వినే అవకాశముందని టాక్. ఈ లెక్కన బుచ్చిబాబు ప్రాజెక్టు పూర్తిగా పక్కన పడుతుందా.? లేక కాస్త టైమ్‌ తీసుకుని మహేష్‌, బుచ్చిబాబు కాంబోను మళ్లీ తెరపైకి తేస్తారా.? అనేది ఆసక్తికరంగా మారింది.