Peddi : దటీజ్ చెర్రీ.. తెలుగు స్టేట్స్‌ను ఊపేస్తున్న పెద్ది ఫీవర్
తెలుగు స్టేట్స్‌ను పెద్ది(Peddi) ఫీవర్ ఊపేస్తోంది. జూన్ 4 రిలీజ్ కాబోతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- May 31, 2026 / 10:42 AM IST
Gossip Garage Peddi fever in Telugu states
Peddi : తెలుగు స్టేట్స్‌ను పెద్ది ఫీవర్ ఊపేస్తోంది. జూన్ 4 రిలీజ్ కాబోతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ టైమ్‌లో ఎంత కష్టపడ్డాడో.. అదే రేంజ్‌లో ఇప్పుడూ కనిపిస్తున్నాడు గ్లోబల్ స్టార్ చెర్రీ. దీని మీద ఇండస్ట్రీలో ఇప్పుడు భారీ డిస్కషన్ నడుస్తోంది.
పెద్ది మూవీ షూటింగ్ టైమ్‌లో చేతికి గాయం అయినా.. దాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు చెర్రీ. బ్రేక్ లేకుండా సినిమా షూటింగ్ పూర్తి చేయడం.. అదే ఉత్సాహంలో చేతికి సపోర్టు బ్రేస్‌తో ప్రమోషన్స్‌లోనూ పాల్గొంటున్నాడు. ఇది తన డెడీకేషన్ లెవల్ ఏంటో చూపిస్తున్నాడు. ఈ ప్రాసెస్‌లో ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువైందని భావిస్తున్న రామ్ చరణ్.. మూవీ రిలీజ్ అయ్యాక కొంతకాలం పూర్తిగా రెస్ట్ మోడ్‌లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Nag Chaitanya : శోభిత బర్త్ డే.. భార్యతో స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన నాగ చైతన్య.. విషెష్ చెప్తూ..
ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్‌కి వెళ్లి రిలాక్స్ అవ్వాలని.. అదే సమయంలో చేతికి సంబంధించిన చిన్న సర్జరీ కూడా చేయించుకోవాలని అనుకుంటున్నాడని టాక్. ఐతే ఈ ట్రిప్ ని కేవలం హాలీడేగా కాకుండా.. క్రియేటివ్ బ్రేక్‌గా మార్చుకోవాలని అనుకుంటున్నాడట. డైరెక్టర్ సుకుమార్‌తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టోరీ డిస్కషన్స్ కూడా అక్కడే స్టార్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఓవరాల్‌గా పెద్ది తర్వాత బ్రేక్ తీసుకున్నా.. తన నెక్స్ట్ మూవీ కోసం రామ్‌చరణ్ ఇప్పటికే ప్లానింగ్ స్టార్ట్ చేసినట్లే కనిపిస్తున్నాడు.
