Pooja Hegde : సినిమాలకు పూజా హెగ్డే గుడ్‌బై.?

ఓవైపు యాక్టింగ్, మరోవైపు డ్యాన్స్ఇంకోవైపు తన అందంతో ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది పూజ హెగ్డే (Pooja Hegde).

Gossip Garage Pooja Hegde Goodbye To Films

Pooja Hegde : ఓవైపు యాక్టింగ్, మరోవైపు డ్యాన్స్ఇంకోవైపు తన అందంతో ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన పూజ హెగ్డే.. కొన్నాళ్లుగా సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. టాలీవుడ్ ప్రాజెక్టులను ఇప్పటికే తగ్గించి బాలీవుడ్ వైపు మొగ్గు చూపిన ఆమె, త్వరలోనే సినిమాలకే గుడ్‌బై చెప్పబోతున్నట్లు టాక్‌.

కొన్ని పెద్ద తెలుగు మూవీస్‌ ఆఫర్ వచ్చినప్పటికి డేట్స్ క్లాష్‌ కావడంతో ఆ ప్రాజెక్టులను వదిలేసిందట పూజా. బాలీవుడ్‌లో కూడా కొత్త ప్రాజెక్టులపై ఆమెకు ఆసక్తి తగ్గినట్లు చెబుతున్నారు. దీంతో ఇక సినిమా రంగం నుంచి పూర్తిగా వైదొలగే ఆలోచనలో ఈ బుట్టుబొమ్మ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ముగ్గురు కొడుకులు కోడళ్లతో అల్లు అరవింద్.. అల్లు ఫ్యామిలీ ఫోటో వైరల్..

ఇటీవలి కాలంలో ఆమె చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడం, వ్యక్తిగత జీవితంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ సోర్సెస్ అంటున్నాయి.

గతంలో ఓ మైగాడ్ నుంచి డీవిల్, ఆచార్య వరకు వివిధ భాషల్లో తన అందం, డాన్స్, నటనతో మెప్పించిన పూజా హెగ్డే, ఇక సిల్వర్‌ స్క్రీన్‌కు దూరంగా ఉండబోతున్నట్లు వస్తున్న గాసిప్స్‌ ఆసక్తికరంగా మారాయి. పూజా ఇప్పటికే బాలీవుడ్‌లో కొన్ని ప్రాజెక్టులు చేసినా, వాటి సక్సెస్ రేటు తక్కువగా ఉండటంతో సినిమా రంగానికి గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది నిజమా లేదా కేవలం రూమర్ మాత్రమేనా అనేది పూజా హెగ్డే రియాక్ట్ అయితే తప్ప గాసిప్స్‌కు చెక్ పడేలా లేదు.