Ticket Rate Hike : టికెట్ల రేట్లు.. మేకర్స్ తంటాలు..!
రిలీజ్‌కు వచ్చేసరికి టికెట్ల రేట్ల పెంపు కోసం ప్రభుత్వాలను (Ticket Rate Hike) రిక్టెస్ట్ చేయాల్సి వస్తుంది.
- Thota Vamshi Kumar
- Published On : February 6, 2026 / 01:14 PM IST
Gossip Garage Ticket Rate Hike tension in producers
Ticket Rate Hikes : సినిమా అంటే ఒక వినోదం. ఓ మూడు గంటల పాటు అన్నింటిని మర్చిపోయేలా చేసి..ఆడియన్స్‌కు ఫీల్ గుడ్ ఫీలింగ్ కలిగిస్తుంది. సినిమా అంటే వినోదమే కాదు వ్యాపారం కూడా. పెద్ద పెద్ద స్టార్లు, పాన్ ఇండియా రేంజ్‌లో తీసిన సినిమాలకు భారీ బడ్జెట్ అవుతుంది. రిలీజ్‌కు వచ్చేసరికి టికెట్ల రేట్ల పెంపు కోసం ప్రభుత్వాలను రిక్టెస్ట్ చేయాల్సి వస్తుంది.
కొన్నిసార్లు మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ పడుతాయనే వరకు కూడా టికెట్ల రేట్లపై క్లారిటీ రాకపోవడంతో మేకర్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంపు కోసం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో అలర్ట్ అయ్యారట మూవీ మేకర్స్.
Tripti Dimri: గోల్డ్ కలర్ డ్రెస్సులో బోల్డ్ బ్యూటీ.. త్రిప్తి ఫొటోస్ వైరల్
90 రోజుల ముందే టికెట్ల రేట్ల పెంపు కోసం అప్లై చేసుకోవాలి లేదా ఉత్తర్వులు జారీ చేయాలన్న హైకోర్టు ఆర్డర్స్‌తో.. నిర్మాతలు ఇప్పటినుంచే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. మరో రెండు నెలల తర్వాతే రిలీజ్ కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టికెట్ల రేట్ల పెంపుకోసం ఆల్రెడీ ప్రొడ్యూసర్లు తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు టాక్.
పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్, రామ్‌చరణ్ పెద్ది మూవీ ఈ రెండూ భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో టికెట్లు రేట్లు పెంచుకోవడానికి మేకర్స్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారట. ముందస్తుగా అప్లై చేసుకుంటే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.? హైకోర్ట్ ఎలాంటి సూచనలు చేస్తుందోనన్న డైలమాలో ఉన్నారట.
ఇక ఏపీలో మాత్రం టికెట్ల రేట్ల పెంపునకు ఎలాంటి అడ్డంకులు లేకపోవటంతో మేకర్స్‌కు కాస్త రిలీఫే అంటున్నారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కూడా లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ పడే పరిస్థితి ఉండబోదని కూడా అంటున్నారు. కాకపోతే ముందే దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి రిప్లై వస్తుందోనన్న టెన్షన్ మాత్రం కంటిన్యూ అవుతోందట.
