Tollywood News: టాలీవుడ్‌కు రూ.3వేల కోట్లు లాస్..?
టాలీవుడ్‌కు (Tollywood) సమ్మర్ లాస్ రూ.3 వేల కోట్లు అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.
- Thota Vamshi Kumar
- Updated on- April 18, 2026 / 12:16 PM IST
Gossip Garage tollywood may loss 3 crore in summer season
Tollywood News: టాలీవుడ్‌కు సమ్మర్ లాస్ రూ.3 వేల కోట్లు అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. పెద్ది పోస్ట్‌పోన్, ది ప్యారడైజ్, టాక్సిక్, విశ్వంబర వంటి భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ సమ్మర్ సీజన్ నుంచి ఒక్కసారిగా తప్పుకోవడంతో టాలీవుడ్‌కు దాదాపు 3000 కోట్ల రూపాయల వరకు లాస్ వచ్చిందని ఇన్ సైడర్స్ లెక్కలు వేస్తున్నారు.
సమ్మర్ అంటేనే బాక్సాఫీస్ బాంబులు పేలాల్సిన సీజన్ కాగా, ఈ సారి థియేటర్లు ఖాళీగా ఉండిపోయి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నిరాశకు గురవుతున్నారు. ఇంత పెద్ద మొత్తం లాస్ తర్వాత కూడా టాలీవుడ్ ఎలా రికవర్ అవుతుందో, మళ్లీ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమాలు ఎప్పుడు వస్తాయో అని ఇండస్ట్రీ సర్కిల్స్‌లో డిస్కషన్ నడుస్తోంది.
*మహేష్‌బాబు వారణాసి మూవీ రిలీజ్ పోస్ట్‌పోన్ కానుందా?
కారణాలు ఏమైనా పెద్ద సినిమాలు సమ్మర్ రేసులో లేకపోవడంతో..టాలీవుడ్‌కు ఎదురైన లాస్ కేవలం బాక్సాఫీస్ మాత్రమే కాదని, మొత్తం ఇండస్ట్రీ ఎకానమీనే దెబ్బతీసిందని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. పెద్ది నుంచి విశ్వంభర వరకు అన్ని ప్రాజెక్టులు పోస్ట్‌పోన్ అవడంతో టికెట్ సేల్స్ పూర్తిగా పడిపోయాయి.
థియేటర్ బిజినెస్ తగ్గిపోయింది. స్టార్ హీరోల ఫ్యాన్స్ నిరుత్సాహ పడిపోయారు. ఇంతకీ ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో, మళ్లీ సమ్మర్ స్లాట్ ఎవరు తీసుకుంటారోనని సమాధానం ప్రశ్నలో తెరమీదకు వస్తున్నాయి. టాలీవుడ్ సమ్మర్ ఈ సారి ఫుల్ లాస్ సీజన్‌గా మారిపోయిందని, జూన్ 4తో మళ్లీ పెద్ద సినిమాల హంగామా స్టార్ట్ కాబోతుందని అంటున్నారు.
