Toxic : టాక్సిక్ ఈవెంట్.. దిల్ రాజు బిగ్ ప్లాన్
కేజీఎఫ్-2 తర్వాత కన్నడ స్టార్ యశ్ చేస్తున్న సినిమా టాక్సిక్(Toxic ).
- Thota Vamshi Kumar
- Published On : February 22, 2026 / 02:38 PM IST
Gossip Garage Toxic Movie Pre Release Event Dil Raju big plan
Toxic : కేజీఎఫ్-2 తర్వాత కన్నడ స్టార్ యశ్ చేస్తున్న సినిమా టాక్సిక్. ఈ మూవీ మార్చి 19న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన టాక్సిక్ మూవీ ట్రైలర్‌కు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే టాక్సిక్ సినిమాను తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు.
దాదాపు 120 కోట్లతో టాక్సిక్ రైట్స్ దక్కించుకున్న ఆయన.. మూవీ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారట. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఏ సినిమా ఈవెంట్ జరగని రేంజ్‌లో టాక్సిక్ మూవీ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది.
Jai Hanuman: హనుమాన్ జన్మస్థలంలో మొదలైన “జై హనుమాన్” మూవీ.. అంజనాద్రిలో ప్రత్యేక పూజలు
సినిమా రిలీజ్‌కు టైమ్ దగ్గర పడుతుండటంతో చాలా డిఫరెంట్‌గా ప్రమోషన్స్ ప్లానింగ్స్ చేస్తున్నారట దిల్‌రాజు. అంతే కాదు ఈవెంట్‌కు గెస్ట్‌లు కూడా చాలామందే ఉన్నారని జూనీయర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రభాస్ లాంటి స్టార్స్ ఈవెంట్ కు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు.
ఇక ఇటీవల రిలీజ్ అయిన టాక్సిక్ మూవీ టీజర్, ట్రైలర్ కూడా పుల్ హైప్ క్రియేట్ చేయటంతో సినిమాపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయంటున్నారు. ఇది పక్కా ధురంధర్-2కు కాంపిటేషన్ అంటున్నారు. టాక్సిక్ మూవీ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ జరుపుతారో, ఎవరెవరు గెస్ట్‌లుగా వస్తారో వేచి చూడాలి.
