Vijay – Jr NTR : టీవీకే విజయ్ బాటలో జూనియర్ ఎన్టీఆర్?
Jr Ntr Party: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా సీనియర్ ఎన్టీఆర్ బాటలో నడవాలని ఫ్యాన్స్ గట్టిగా ఆశిస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- May 5, 2026 / 05:15 PM IST
Gossip Garage TVK Vijay Victory Jr NTR Party In Telugu States
Vijay – Jr NTR : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ TVK పార్టీ సాధించిన విజయం తెలుగు స్టేట్స్‌లో ఇంట్రెస్టింగ్ చర్చకు దారితీసింది. సినీ స్టార్ అయిన విజయ్ తన పాపులారిటీని రాజకీయ శక్తిగా మార్చి, అటు డీఎంకే..ఇటు అన్నాడీఎంకే కూటమికి సవాల్ చేసి మరీ సక్సెస్ కొట్టారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా సీనియర్ ఎన్టీఆర్ బాటలో నడవాలని ఫ్యాన్స్ గట్టిగా ఆశిస్తున్నారు.
హీరో నందమూరి తారక రామారావు 1983లో TDPని స్థాపించి తెలుగు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించినట్లు, జూనియర్ ఎన్టీఆర్ కూడా కొత్త పార్టీ పెట్టి తెలంగాణ-ఏపీల్లో కొత్త చరిత్ర రాయొచ్చని గాసిప్స్ బయలుదేరాయి. మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్..ఎన్టీఆర్‌కు ఉన్న స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకుని..ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన టైమ్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Kamakshi Bhaskarla : నటిగా పీక్స్ లో కెరీర్.. సడెన్ గా సినిమాలకు బ్రేక్ ప్రకటించిన హీరోయిన్..
యూత్, జెన్‌జీలో కొత్త నాయకత్వం కోసం ఉన్న ఆకాంక్షలు జూనియర్ ఎన్టీఆర్‌ను ఆలోచింపజేస్తున్నాయని టాక్. సీనియర్ ఎన్టీఆర్ లాగా తన సొంత పార్టీతో అడుగుపెడితే, నందమూరి వారసత్వం, మాస్ అప్పీల్, సినీ ఫ్యాన్ బేస్ ఆయనకు భారీ బలం అవుతాయని అంటున్నారు ఫ్యాన్స్.
విజయ్ TVK సక్సెస్ చూసిన తర్వాత ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లుగా సరికొత్త ఎజెండాతో ఎన్టీఆర్ పాలిటిక్స్‌లో అడుగుపెట్టే అవకాశం ఉందంటున్నారు. 2029 ఎన్నికల ముందు ఎన్టీఆర్ కొత్త పార్టీ ప్రకటించి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మార్చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఎన్టీఆర్ సినిమాలపై ఫుల్ ఫోకస్ చేస్తున్నా, ప్రజెంట్ పాలిటిక్స్, పొలిటికల్ వ్యాక్యూమ్‌ను చూసి ఆయన కూడా ఆలోచనలో పడ్డారని టాక్. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇప్పట్లో ఉండబోతోందా.? లేక ఫ్యాన్ ఊహగానాలు మాత్రమేనా.? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
