Sara Ali Khan – Ananya Panday : బాలీవుడ్ ముద్దుగుమ్మల జిమ్ వర్క్ అవుట్ వీడియో చూశారా..?
బాలీవుడ్ ముద్దుగుమ్మలు సారా అలీఖాన్, అనన్య పాండే.. జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ చెమటలు చిందిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
- gum 95921
- Published On : October 27, 2023 / 06:34 PM IST
GYM Workout Videos Sara Ali Khan and Ananya Panday working out together
Sara Ali Khan – Ananya Panday : బాలీవుడ్ భామలు ఫిట్‌నెస్ విషయంలో పక్కా టైం టేబుల్ మెయిన్‌టైన్ చేస్తుంటారు. మలైకా అరోరా, శిల్పా శెట్టి వంటి సీనియర్ భామలు యోగ చేస్తూ తమ ఫిట్‌నెస్ ని మెయిన్‌టైన్ చేస్తూ వస్తుంటే.. కృతి సనన్, దిశా పాటని వంటి నేటి భామలు బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ చేస్తూ తమ బాడీని అందంగా ఉంచుకుంటున్నారు. ఒక భామని చూసి మరో భామ.. జిమ్ లో ఎక్కువ వర్క్ అవుట్స్ చేస్తూ పరోక్షంగా ఫిట్‌నెస్ ఛాలెంజ్ ని ముందుకు తీసుకు వెళ్తున్నారు.
తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు సారా అలీఖాన్, అనన్య పాండే.. జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ చెమటలు చిందిస్తున్నారు. ఇద్దరు కలిసి జిమ్ లో పోటాపోటీగా కసరత్తులు చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సారా, అనన్య చెమటలు చిందిస్తూ వర్క్ అవుట్స్ చేస్తున్న వీడియో.. నెటిజెన్స్ కి కూడా చెమటలు పట్టిస్తుంది. బుల్లి డ్రెస్సుల్లో ముద్దుగుమ్మల అందాలు చూసి అభిమానులు, నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. మరి ఆ జిమ్ వీడియో వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.
Also read : Varun – Lavanya : ఏడడుగులు వేయడానికి ఇటలీ బయలుదేరిన వరుణ్, లావణ్య..
ఇక ఇద్దరి భామల సినిమాల విషయానికి వస్తే.. ఇద్దరి చేతుల్లో మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. సారా అలీఖాన్ ‘ఏ వతన్ మేరే వతన్’ అనే సినిమాలో నటించగా.. ఇది షూటింగ్ పూర్తి చేసుకొని పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇక అనన్య పాండే నటించిన ఒక సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘ఖో గయే హమ్ కహాన్’ అనే సినిమా నవంబర్ లో రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతుంది.
