Hansika Motwani: కోర్టు మెట్లెక్కిన ‘దేశముదురు’ హీరోయిన్.. వదినపై రూ. 2 కోట్ల పరువు నష్టం దావా

వదినపై ఏకంగా రూ. 2 కోట్ల పరువు నష్టం దావా వేసిన హన్సిక మోత్వాని(Hansika Motwani).

Hansika Motwani files 2 crore defamation suit against sister in law

  • హన్సిక ఇంట్లో గృహహింస సెగలు
  • వదిన ఆరోపణలతో హన్సిక సంచలన నిర్ణయం
  • తనపై అసత్య ప్రచారాలకు కోర్టు ద్వారా చెక్

Hansika Motwani: నటి హన్సిక మోత్వానీ ప్రస్తుతం కుటుంబ వివాదంలో చిక్కుకున్నారు. తన వదిన నాన్సీ జేమ్స్ (ముస్కాన్) సోషల్ మీడియా వేదికగా హన్సిక కుటుంబంపై గృహహింస ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మొదలైంది. హన్సిక కుటుంబ సభ్యులు తనను శారీరకంగా, మానసిక వేదనకు గురిచేశారని నాన్సీ చేసిన పోస్ట్‌లు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు తన వ్యక్తిగత ప్రతిష్ఠను, సామాజిక గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని హన్సిక తీవ్రంగా పరిగణించారు.

*బాక్సాఫీస్ బాద్‌షాలు.. వెయ్యి కోట్ల క్లబ్‌లో సంజయ్ దత్ టాప్.. ప్రభాస్, షారుఖ్ లది ఎన్నో ప్లేస్ తెలుసా?

ఈ ఆరోపణలకు చెక్ పెట్టేందుకు హన్సిక(Hansika Motwani) ముంబై సెషన్స్ కోర్టులో రూ. 2 కోట్ల పరువు నష్టం దావా వేశారు. కేవలం డబ్బు వసూలు చేసే ఉద్దేశంతోనే నాన్సీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె తన పిటిషన్‌లో డిమాండ్ చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు, ప్రాథమిక ఆధారాలను పరిశీలించి హన్సికకు వ్యతిరేకంగా ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయకూడదని నాన్సీని ఆదేశిస్తూ తాత్కాలిక స్టే విధించింది.

ఇటీవలే వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న హన్సికకు, ఈ కొత్త వివాదం మరింత తలనొప్పిగా మారింది. ఆస్తులు, ఇతర కారణాలతో సొంత కుటుంబ సభ్యులే కోర్టు మెట్లు ఎక్కడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలు ఆమె కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి గుట్టు రచ్చకెక్కడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.